● అప్పుడే భానుడి భగభగలు ● పెరుగుతున్న పగటి ఉష్ణోగ్రతలు
ఆదిలాబాద్‌టౌన్: జిల్లాలో ఎండలు ముదురుతున్నాయి. మార్చిలోనే భానుడు తన ప్రతాపం చూపుతున్నాడు. ఉక్కపోత షురూ కావడంతో జనం ఇ బ్బందులకు గురవుతున్నారు. ఉదయం 11 దాటిందంటే ఎండ తీవ్రత తట్టుకోలేక పోతున్నారు. పగ టి ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ప్రస్తుతం జిల్లాలో 40 డిగ్రీల సెల్సియస్‌కు చేరువైంది. బేలలో బుధవారం 39.9 డిగ్రీలుగా నమోదైంది. ఈ ఏడాది ఎండలు మండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఎండ ల తీవ్రత దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ప్రస్తుతం మధ్యాహ్న సమయంలో ఎండ తీవ్రత పెరగడంతో జిల్లా కేంద్రంలోని ప్రధాన కూడళ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి. నిత్యం కిటకిటలాడే బస్టాండ్, రైల్వేస్టేషన్, తెలంగా ణచౌక్, అంబేడ్కర్,గాంధీచౌక్ ప్రాంతాలు బోసి పో యి దర్శనమిస్తున్నాయి. చిరువ్యాపారులు, ఉపాధిహామీకూలీలు ఇబ్బందులకు గురవుతున్నారు.
కూలర్లకు అతుక్కుపోయి..
ఎండ వేడిమి తట్టుకోలేక జనం ఇళ్లకే పరిమితమవుతున్నారు. కూలర్లు, ఏసీలకు అతుక్కుపోతున్నారు. మధ్యాహ్న సమయంలో ఇంటినుంచి బయటకు వెళ్లేందుకు జంకుతున్నారు. ఎండవేడిమి తట్టుకునేందుకు వ్యాపారులు, ఇతర పనులకు వెళ్లేవారు శీతలపానియాలు, కొబ్బరి బోండాలు తాగుతూ ఉపశమనం పొందుతున్నారు. మరోవైపు దాహార్తి తో మూగజీవాలు అల్లాడుతున్నాయి.
వడదెబ్బతో అప్రమత్తం..
జిల్లాలో ఎండ తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఎండలో పనిచేసే వారు, తిరిగే వారు త్వరగా వడదెబ్బకు గురయ్యే అవకాశాలు ఉంటాయని పేర్కొంటున్నారు. గొడుగు, ఇతర రక్షణ కవచాలు ధరించాలని సూచిస్తున్నారు. కళ్లు తిరగడం, తీవ్రమైన తలనొప్పి, గుండె దడ, చెమట ఎక్కువగా రావడం, ఫిట్స్ తదితర లక్షణాలు బయట పడతాయని చెబుతున్నారు. శరీరంలో ప్రొటీన్ స్థాయి తగ్గిపోయి అవయవాలు పనిచేయడం ఆగిపోతాయని పేర్కొంటున్నారు. శరీర ఉష్ణోగ్రతలు మామూలు స్థితిలో ఉండేలా చూసుకోవాలని చెబుతున్నారు. వృద్ధులు, చిన్నారులకు వేడిగాలి తగిలినా వడదెబ్బకు గురయ్యే ప్రమాదం లేకపోలేదని వివరిస్తున్నారు.
మధ్యాహ్న సమయంలో ఎండ కారణంగా నిర్మానుష్యంగా బస్టాండ్ రహదారి
జిల్లాలో ఆరు రోజులుగా నమోదైన
ఉష్ణోగ్రతలు (డిగ్రీ సెల్సియస్‌లో)
తేదీ కనిష్టం గరిష్టం
7న 11.7 34.8
8న 13.2 36.3
9న 15.7 38.3
10న 20.7 38.0
11న 20.7 37.8
12న 39.9 19.2
జాగ్రత్తలు పాటించాలి
ఎండల తీవ్రత పెరుగుతున్న క్రమంలో ప్రజలు జాగ్రత్తలు పాటించాలి. అత్యవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు వెళ్లకూడదు. చిన్నారులు, గర్భిణులు, బాలింతలు ఎండ బారిన పడకుండా చూడాలి. వదులైన కాటన్ దుస్తులు ధరించాలి. రోజుకు కనీసం 5 లీటర్ల నీటిని తాగడం మంచిది. ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచుకోవాలి. పండ్ల రసాలు, కొబ్బరి నీళ్లు తాగడం శ్రేయస్కరం.
– డాక్టర్ రమ, గైనకాలజిస్ట్
● అప్పుడే భానుడి భగభగలు ● పెరుగుతున్న పగటి ఉష్ణోగ్రతలు
● అప్పుడే భానుడి భగభగలు ● పెరుగుతున్న పగటి ఉష్ణోగ్రతలు
● అప్పుడే భానుడి భగభగలు ● పెరుగుతున్న పగటి ఉష్ణోగ్రతలు
Comments
Please login to add a commentAdd a comment