17 నుంచి కష్ఠు గుర్తింపు సర్వే
ఆదిలాబాద్‌టౌన్: ఈనెల 17 నుంచి జిల్లాలో నిర్వహించే కుష్ఠు గుర్తింపు సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని డీఎంహెచ్‌వో నరేందర్ రాథోడ్ అన్నా రు. డీఎంహెచ్‌వో సమావేశ మందిరంలో ఎల్‌సీడీసీ సర్వేపై బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆశ కార్యకర్తలు ఈనెల 17 నుంచి 30వరకు తమకు కేటాయించిన ఇళ్లను సందర్శించి కుష్ఠు అనుమానితులను గుర్తించాలన్నారు. సమావేశంలో జిల్లా కుష్ఠు నివారణ అధికారి గజానంద్, టీబీ నియంత్రణ అధికారి సుమలత, డీపీఎంవోలు రమేశ్, వామన్‌రావు, వైద్యాధికారులు, లెప్రసీ నోడల్ పర్సన్లు, సూపర్‌వైజర్లు పాల్గొన్నారు.
శిబిరం పరిశీలన
ఆదిలాబాద్‌రూరల్: మండలంలోని అంకోలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో గల బంగారుగూడలో బుధవారం నిర్వహించిన వ్యాధి నిరోధక టీకాల శిబిరాన్ని డీఎంహెచ్‌వో నరేందర్ రాథోడ్ పరిశీలించారు.
Comments
Please login to add a commentAdd a comment