● ఎమ్మెల్సీ ఎన్నికల్లో 69శాతం ఓటేసిన పట్టభద్రులు ● 92 శాతం దాటిన ఉపాధ్యాయుల ఓటింగ్‌ ● ఎన్నికల ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్‌, ఎస్పీ ● భద్రత నడుమ కరీంనగర్‌కు బ్యాలెట్‌ బాక్స్‌లు | - | Sakshi
Sakshi News home page

● ఎమ్మెల్సీ ఎన్నికల్లో 69శాతం ఓటేసిన పట్టభద్రులు ● 92 శాతం దాటిన ఉపాధ్యాయుల ఓటింగ్‌ ● ఎన్నికల ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్‌, ఎస్పీ ● భద్రత నడుమ కరీంనగర్‌కు బ్యాలెట్‌ బాక్స్‌లు

Published Fri, Feb 28 2025 2:16 AM | Last Updated on Fri, Feb 28 2025 2:12 AM

● ఎమ్

● ఎమ్మెల్సీ ఎన్నికల్లో 69శాతం ఓటేసిన పట్టభద్రులు ● 92 శ

బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రంలో క్యూలో ఓటర్లు

ఓటుహక్కు వినియోగించుకున్న ఎంపీ నగేశ్‌

ఓటు హక్కు వినియోగించున్న పట్టభద్రులు

ఓటు వేసి సిరా గుర్తు చూపుతున్న

కోడలు, అత్త, మామ

కైలాస్‌నగర్‌: మెదక్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, కరీంనగర్‌ నియోజకవర్గ పట్టభద్రులు, టీచర్స్‌ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ ప్రక్రియ గురువారం ప్రశాంతంగా ముగిసింది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఉదయంనుంచే ఉపాధ్యాయ ఓటర్లు ఉత్సాహాంగా కేంద్రాలకు తరలివచ్చారు. పట్టభద్ర ఓటర్లు మాత్రం కాస్త నెమ్మదించడంతో ఓటింగ్‌ ప్రక్రియ మందకొడిగా సాగింది. జిల్లాలోని మెజార్టీ కేంద్రాల్లో నిర్ణీత సమయానికే పోలింగ్‌ ముగియగా ఒకటి, రెండు కేంద్రాల్లో కొంత ఆలస్యమైంది. నిర్దేశిత సమయానికి కేంద్రాలకు చేరుకున్న ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలు గా ఎన్నికల సిబ్బంది వారిని కేంద్రాల్లోకి అనుమతించారు. జిల్లాలోని పలు పోలింగ్‌ కేంద్రాలను కలెక్టర్‌ రాజర్షి షా, ఎస్పీ గౌస్‌ ఆలం పరిశీలించారు. పోలింగ్‌ సరళిపై ఆరా తీశారు. ప్రధాన పార్టీల నాయకులు సైతం ఆయా కేంద్రాలను సందర్శిస్తూ పార్టీశ్రేణుల ద్వారా వివరాలడిగి తెలుసుకున్నారు.

ఓటెత్తిన టీచర్లు.. నెమ్మదించిన పట్టభద్రులు

పోలింగ్‌ ప్రక్రియ ఉదయం 8గంటలకు ప్రారంభమైంది. ఈ ఎన్నికలను బ్యాలెట్‌ విధానంలో నిర్వహించారు. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఉపాధ్యాయులు ఎక్కువ ఆసక్తి చూపారు. ఉదయం నుంచే జిల్లాలోని ఆయా పోలింగ్‌ కేంద్రాలకు చేరుకున్నారు. ప్రారంభం నుంచి చివరి వరకు జోరుగా నమోదైంది. ఇక పట్టభద్ర ఓటర్లు కేంద్రాలకు కొంత ఆలస్యంగా చేరుకున్నారు. ఉదయం పది గంటల వరకు పోలింగ్‌ మందకొడిగా సాగింది. తొలి రెండు గంటల వరకు 7.84శాతం మాత్రమే నమోదుకావడం గమనార్హం. ఓటర్లు పలు కేంద్రాలకు పోలింగ్‌ ముగిసే సమయంలో రావడంతో ఎన్నికల అధికారులు వారికి ప్రత్యేక నంబర్లు జారీ చేసి ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు.

కేంద్రాల వద్ద పార్టీల సందడి

జిల్లాలోని ఆయా పోలింగ్‌ కేంద్రాల వద్ద ప్రధానంగా కాంగ్రెస్‌, బీజేపీ శ్రేణుల సందడి కనిపించింది. కేంద్రాలకు సమీపంలో ప్రత్యేక షామియానాలు ఏర్పాటు చేసుకుని ఆయా పార్టీల నాయకులు కూర్చున్నారు. ఓటర్లకు పోల్‌చీటీలు అందించడంతో పాటు జాబితాలోని వారి సీరియల్‌ నంబర్లను తెలియజేశారు. ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌, కాంగ్రెస్‌ అసెంబ్లీ ఇన్‌చార్జి కంది శ్రీనివాసరెడ్డి, కిసాన్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్‌రెడ్డి జిల్లా కేంద్రంలోని పలు పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించారు.

కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్‌, ఎస్పీ

సరస్వతినగర్‌ పోలింగ్‌ కేంద్రంలో ఓటేసేందుకు వచ్చిన పట్టభద్రులు

భీంపూర్‌ పట్టభద్రులు.. ఓటేశారు

పటిష్ట బందోబస్తు

జిల్లాలోని పలు పోలింగ్‌ కేంద్రాలను కలెక్టర్‌, ఎస్పీ వేర్వేరుగా పరిశీలించారు. జిల్లా కేంద్రంలోని గిరిజన సంక్షేమ బాలుర రెసిడెన్షియల్‌ పాఠశాలతో పాటు ఇంద్రవెల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలలోని పోలింగ్‌ కేంద్రాలను కలెక్టర్‌ సందర్శించారు. సిబ్బందికి పలు సూ చనలు చేశారు. అలాగే జిల్లా కేంద్రంలోని డైట్‌ కళా శాల, ఉట్నూర్‌లోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కేంద్రాలను ఎస్పీ పరిశీలించారు. ఎన్నికల ప్రక్రియ తీరుపై ఆరా తీశారు.

కరీంనగర్‌కు తరలిన బ్యాలెట్‌ బాక్స్‌లు

పోలింగ్‌ ముగిసిన వెంటనే బ్యాలెట్‌ బాక్స్‌లకు ఎన్నికల అధికారులు సీల్‌ వేశారు. రూట్ల వారీగా వాటిని ప్రత్యేక వాహనాల్లో భారీ భద్రత నడుమ కరీంనగర్‌కు తరలించారు. అక్కడి అంబేద్కర్‌ భవన్‌లో ఏర్పాటు చేసిన ఎన్నికల సామగ్రి రిసెప్షన్‌ సెంటర్‌లో అప్పగించనున్నారు. మార్చి 3న ఓట్ల లెక్కింపు ప్రక్రియ అక్కడే కొనసాగనుంది. అప్పటి వరకు వాటిని పోలీస్‌ భద్రత నడుమ స్ట్రాంగ్‌రూంలో భద్రపర్చనున్నారు. జిల్లాకు సంబంధించిన బ్యాలెట్‌ బాక్స్‌లను రీసివ్‌ చేసుకుని స్ట్రాంగ్‌రూంలో భద్రపరిచేందుకు గాను రెవెన్యూ సిబ్బందిని ఉదయమే ప్రత్యేక వాహనాల్లో కరీంనగర్‌కు తరలించారు. వాటిని భద్రపర్చిన అనంతరం అక్కడి అధికారులకు అప్పగించనున్నారు.

తాంసి: భీంపూర్‌లో ఉదయం 8 గంటలకు పో లింగ్‌ ప్రారంభమైనా 10 గంటల వరకూ పట్టభద్రుల ఓటర్లు ఓటింగ్‌లో పాల్గొనలేదు. స్థానిక రహదారి నిర్మాణ విషయంలో తామంతా ఓటింగ్‌కు దూరంగా ఉంటామని ‘మండల పట్టభద్రుల రోడ్డు సాధన సమితి ఫోరం’ పేరిట ఇదివరకే జిల్లా కేంద్రంలో ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో గురువారం ఉదయం 10 గంటల వరకు కూడా వారు ఓటింగ్‌లో పాల్గొనకపోవడంతో కొంత సందిగ్ధం నెలకొంది. ఓటు హక్కు వినియోగించుకోవాలని జైనథ్‌ సీఐ సాయినాథ్‌, భీంపూర్‌ ఎస్సై కలీం వారికి నచ్చ జెప్పారు. అధికారుల నుంచి స్పష్టమైన హామీ వచ్చే వరకు పాల్గొనమని వారు స్పష్టం చేశారు. విషయం తెలుసుకున్న కలెక్టర్‌ రాజర్షిషా సామాజిక మాధ్యమాల ద్వారా ఓటింగ్‌లో పాల్గొనాలని వీడియో పంపారు. సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ఫోరం సభ్యులంతా ఓటు హక్కు వినియోగించుకున్నారు. మండల వ్యాప్తంగా 244 మంది పట్టభద్రుల ఓటర్లు ఉండగా 184 మంది ఓటేశారు.

ఆదిలాబాద్‌టౌన్‌: మెదక్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌, ఆదిలాబాద్‌ ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలీసు యంత్రాంగం పటి ష్ట బందోబస్తు ఏర్పాటు చేసింది. గురువారం నిర్వహించిన పోలింగ్‌ ప్రక్రియను ఎస్పీ గౌస్‌ ఆలం పరిశీలించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డైట్‌ కళాశాల, సరస్వతినగర్‌లోని జెడ్పీఎస్‌ఎస్‌ (బాలికలు), ట్రైబల్‌ వెల్ఫేర్‌ (బాలుర)జూనియర్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రాలతో పాటు గుడిహత్నూర్‌, ఇంద్రవెల్లి, ఉట్నూర్‌లోని పోలింగ్‌ కేంద్రాలను ఆయన పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా 400 మంది సిబ్బందితో బందోబస్తు చేపట్టారు. 20 లొకేషన్లలోని 39 కేంద్రాల్లో ప్రత్యేకంగా ఎనిమిది రూట్లను ఏర్పాటు చేశారు. అలాగే అదనపు ఎస్పీ సురేందర్‌ రావు, ఆదిలాబాద్‌ డీఎస్పీ జీవన్‌రెడ్డి, ఉట్నూర్‌ డీఎస్పీ నాగేందర్‌, డీసీఆర్బీ డీఎస్పీ శ్రీనివాస్‌తో పాటు సీఐలు, ఎస్సైలు పోలింగ్‌ కేంద్రాలను సందర్శించారు. 163 బీఎన్‌ఎస్‌ఎస్‌ యాక్ట్‌ అమలుపర్చారు. పోలింగ్‌ ప్రశాంతంగా ముగియడంతో యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు బందోబస్తు కొనసాగింది.

No comments yet. Be the first to comment!
Add a comment
● ఎమ్మెల్సీ ఎన్నికల్లో 69శాతం ఓటేసిన పట్టభద్రులు ● 92 శ1
1/4

● ఎమ్మెల్సీ ఎన్నికల్లో 69శాతం ఓటేసిన పట్టభద్రులు ● 92 శ

● ఎమ్మెల్సీ ఎన్నికల్లో 69శాతం ఓటేసిన పట్టభద్రులు ● 92 శ2
2/4

● ఎమ్మెల్సీ ఎన్నికల్లో 69శాతం ఓటేసిన పట్టభద్రులు ● 92 శ

● ఎమ్మెల్సీ ఎన్నికల్లో 69శాతం ఓటేసిన పట్టభద్రులు ● 92 శ3
3/4

● ఎమ్మెల్సీ ఎన్నికల్లో 69శాతం ఓటేసిన పట్టభద్రులు ● 92 శ

● ఎమ్మెల్సీ ఎన్నికల్లో 69శాతం ఓటేసిన పట్టభద్రులు ● 92 శ4
4/4

● ఎమ్మెల్సీ ఎన్నికల్లో 69శాతం ఓటేసిన పట్టభద్రులు ● 92 శ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement