కైలాస్‌నగర్: ఉపాధ్యాయ నియోజకవర్గానికి సంబంధించి జిల్లాలోని ఆయా పోలింగ్ కేంద్రాల్లో నమోదైన ఓట్లను పరిశీలిస్తే అత్యధికంగా 429 మంది ఓటు హక్కు వినియోగించుకోగా.. అత్యల్పంగా 13 మంది ఓటు వేశారు.
● ఆదిలాబాద్‌లోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో 480 మంది ఓటర్లున్నారు. వీరిలో 286 మంది పురుషులు, 194 మంది మహిళలు ఉన్నారు. ఇందులో ఓటు వేసిన వారిని పరిశీలిస్తే పురుషులు 269 మంది, మహిళలు 160 మంది ఉన్నారు.
● ఇక అత్యల్పంగా భీంపూర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల కేంద్రంలో నమోదైంది. ఇక్కడ 13 మంది పురుషులు, ఇద్దరు మహిళలు మొత్తం 15 మంది ఓటర్లున్నారు. వీరిలో 11 మంది పురుషులు, ఇద్దరు మహిళలు ఓటు హక్కు వినియోగించుకున్నారు.
పట్టభద్రుల నియోజకవర్గంలో..
● అత్యధికంగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డైట్ కళాశాల కేంద్రంలో నమోదైంది. ఈ కేంద్రంలో 585 మంది పురుషులు, 370 మ ంది మహిళలు కలిపి మొత్తం 955 మంది ఓ టర్లున్నారు. వీరిలో 432 మంది పురుషులు, 239 మంది మహిళలు మొత్తం 671 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.
● అత్యల్పంగా చూస్తే సిరికొండ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల కేంద్రంలో నమోదైంది. ఇక్కడ మొత్తం 97 మంది ఓటర్లున్నారు. వీరిలో పురుషులు 81, మహిళలు 16 మంది ఉన్నారు. మొత్తంగా 77 మంది ఓటు హక్కు వినియోగించుకోగా వీరిలో పురుషులు 67 మంది, మహిళలు 10 మంది ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment