‘సర్కారు’ విద్యార్థులకు ట్యాబ్‌లు
జిల్లా పాఠశాలలు ట్యాబ్‌లు
ఆదిలాబాద్ 13 325
ఆసిఫాబాద్ 10 250
మంచిర్యాల 16 400
నిర్మల్ 15 375
మంచిర్యాలఅర్బన్: సర్కారు బడి విద్యార్థులకు ట్యాబ్‌లు అందుబాటులోకి రానున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సాంకేతిక విద్య అమల్లో భాగంగా చర్యలు వేగవంతం చేశాయి. ఇప్పటికే పీఎంశ్రీలో ఎంపిక చేసిన పాఠశాలలకు మొదటి విడతలో కంప్యూటర్లు, యూపీఎస్, ఇన్వర్టర్లు మంజూరు చేయగా విద్యార్థులకు ట్యాబ్‌లు ఇచ్చేందుకు కసరత్తు పూర్తయింది. ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా పథకంలో భాగంగా విద్యార్థులకు ట్యాబ్‌ల ద్వారా బోధన చేయనున్నారు. ఉపాధ్యాయులు బోర్డుపై బోధించే అంశాలను నేరుగా చూసేలా అవకాశం కల్పించనున్నారు. ఒక్కో పాఠశాలకు 25 ట్యాబ్‌లను త్వరలోనే సరఫరా చేయనున్నారు. సెల్‌కాన్ ఇంపెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ సాంసంగ్ ఏ7 లైట్(ఎస్‌ఎం–టీ225) ట్యాబ్‌లు మంజూరు చేస్తూ జిల్లా విద్యాశాఖ అధికారులకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పీఎంశ్రీ కింద ఎంపికై న ఒక్కో పాఠశాలకు 25 చొప్ప్పున 1350 ట్యాబ్‌లు మొదటి విడతలో మంజూరయ్యాయి. త్వరగా ట్యాబ్‌లను విద్యార్థులకు అందించి పాఠ్యాంశాలకు సంబంధించిన అంశాలు, అనుమానాలను నివృత్తి చేసేలా బోధన చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment