నిమిషం నిబంధన సడలించాలి
ఆదిలాబాద్‌రూరల్: త్వరలో ప్రారంభం కా నున్న ఇంటర్ పరీక్షల్లో నిమిషం నిబంధన సడలించాలని తెలంగాణ మాదిగ జేఏసీ జిల్లా అధ్యక్షుడు మల్యాల మనోజ్ విజ్ఞప్తి చే శారు. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవన్‌లో తెలంగాణ మాదిగ జేఏసీ, గిరిజన సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం ఏర్పాటు చే సిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనెల 5 నుంచి నిర్వహించనున్న ఇంటర్ వార్షిక పరీక్షల్లో నిమిషం నిబంధన సడలించాలని సీఎం రేవంత్‌రెడ్డి, ఉన్నత విద్యాశా ఖ అధికారులకు విజ్ఞప్తి చేశామన్నారు. గతేడాది ఈ నిబంధనతో కొంతమంది దూరప్రాంతాలకు చెందిన విద్యార్థులు సకాలంలో కేంద్రానికి చేరుకోలేకపోయారన్నారు. పరీక్ష రాయలేని క్రమంలో పలువురు ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలు ఉన్నాయన్నారు. ఈ విషయమై పునరాలోచించి కనీ సం15 నిమిషాల వరకు అనుమతి ఇవ్వాలన్నారు. సమావేశంలో ఆదివాసీ కొలాం సేవా సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు కొడ ప సోనేరావు, లహుజీ శక్తి సేన జిల్లా అధ్యక్షుడు గొడకేమధుకర్, నాయకులు సంజయ్ తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment