అధికారికంగా శ్రీపాదరావు జయంతి●
కై లాస్‌నగర్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు జయంతి వేడుకలను ఆదివారం అధికారికంగా నిర్వహించారు. స్థానిక జెడ్పీ సమావేశ మంది రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శ్రీ పాద రావు చిత్రపటానికి కలెక్టర్ రాజర్షి షా, అదనపు కలెక్టర్ శ్యామలాదేవి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, శ్రీపాదరావు జీవితం నేటితరానికి ఆదర్శనీయమని కొని యాడారు. స్పీకర్‌గా అసెంబ్లీని నడిపించిన తీరు మరువలేనిది వెల్లడించారు. కార్యక్రమంలో డీవైఎస్‌వో వెంకటేశ్వర్లు, కలెక్టరేట్ సూపరింటెండెంట్లు రాథోడ్ పంచపూల, శైలజ తదితరులు పాలొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన చిన్నారుల నృత్యాలు ఆకట్టుకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment