రాజీమార్గం రాజమార్గం
ఆదిలాబాద్‌టౌన్: రాజీమార్గం ద్వారా కేసులు పరిష్కరించుకుని కక్షిదారులు ప్రశాంతమైన జీవనం గడపాలని జిల్లా మొదటి అదనపు జడ్జి శివరాం ప్రసాద్ అన్నారు. జిల్లా కోర్టు ప్రాంగణంలో డీఎల్‌ఎస్‌ఏ ఆధ్వర్యంలో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. రాజీ కుదుర్చుకున్న పలు కేసులను పరిష్కరించి క్షకిదారులకు పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ, కక్షిదారులు ఏళ్లుగా కోర్టుల చుట్టూ తిరుగుతూ సమయాన్ని వృథా చేసుకోవద్దనే ఉద్దేశంతోనే లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో రాజీపడదగ్గ సివిల్, క్రిమినల్ కేసులను ఇరువర్గాల సమ్మతితో పరిష్కరిస్తామన్నారు. కక్షిదారులపై ఎలాంటి భయం, ఒత్తిడి పెట్టబోమన్నారు. లోక్ అదాలత్‌లో పరిష్కారమైన కేసులపై అప్పీల్‌కు వెళ్లే అవకాశం కూడా ఉండదన్నారు. కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని రాజీపడే కేసులను పరిష్కరించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డీఎల్‌ఎస్‌ఏ కార్యదర్శి సౌజన్య, జడ్జిలు ప్రమీళజైన్, కలిందే తులసి, దుర్గారాణి, హుస్సేన్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నగేశ్, డీఎస్పీ ఎల్.జీవన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మహిళా న్యాయమూర్తులకు సన్మానం
అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని డీఎల్‌ఎస్‌ఏ ఆధ్వర్యంలో మహిళా న్యాయమూర్తులను ఘనంగా సన్మానించారు. వారి సేవలను కొనియాడారు. మహిళలను గౌరవించడం మన సంప్రదాయమని, ప్రతి ఒక్కరూ వారికి సముచిత గౌరవం ఇవ్వాలని జడ్జి శివరాం ప్రసాద్ అన్నారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు, ఉద్యోగులు, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
● జడ్జి శివరాం ప్రసాద్
Comments
Please login to add a commentAdd a comment