జిల్లాను ఎప్పటికీ మరిచిపోలేను
ఆదిలాబాద్‌టౌన్: ఆదిలాబాద్ జిల్లాను ఎప్పటికీ మరిచిపోలేనని ఎస్పీ గౌస్ ఆలం అన్నారు. కరీంనగర్ సీపీగా బదిలీపై వెళ్తున్న ఆయనకు జిల్లా పోలీ సు అధికారులు ఆదివారం ఘనంగా వీడ్కోలు పలికారు. స్థానిక పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహించిన కార్యక్రమంలో పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. గజమాలతో సత్కరించారు. ప్రత్యేకంగా అలంకరించిన జీపులో ఉన్న ఎస్పీ కుటుంబీకులపై పూల వర్షం కురిపించారు. అనంతరం పోలీస్ అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది హెడ్‌క్వార్టర్స్ వరకు తాడుతో లాగి తమ అభిమానాన్ని చాటారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లాను, ఇక్కడి సిబ్బందిని విడిచి వెళ్లడం బాధాకరమన్నారు. 14 నెలల పాటు చేసిన సేవలు, పోలీసులతో తన అనుబంధాన్ని పంచుకున్నారు. సహకరించిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో డీఎస్పీలు జీవన్‌రెడ్డి, శ్రీనివాస్, నాగేందర్, హసీబుల్లా, సీఐలు, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్లు, ఎస్సైలు, రిజర్వ్ సబ్ ఇన్‌స్పెక్టర్లు, పోలీసు సిబ్బంది, వివిధ శాఖల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
బదిలీ వీడ్కోలు సందర్భంగా ఎస్పీ గౌస్ ఆలం
పూల వర్షం కురిపించిన పోలీస్ అధికారులు
జిల్లాను ఎప్పటికీ మరిచిపోలేను
Comments
Please login to add a commentAdd a comment