‘మోడల్’ స్కూల్ టీచర్లపై వేటు
బజార్‌హత్నూర్: ఆదిలాబాద్ జిల్లా బజార్‌హత్నూర్ మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ కు చెందిన ముగ్గురు టీచర్లపై వేటు పడింది. కాంట్రాక్ట్ ఒకేషనల్ ఉపాధ్యాయుడు అజయ్, అవర్లీ బెస్డ్ టీచర్లు జ్ఞానేశ్వర్, ఉమేష్ విద్యార్థినులతో అనుచితంగా ప్రవర్తించినట్లు ఫొటోలు వైరల్ కావడంతో కలెక్టర్ ఆదేశాల మేరకు డీఈవో వారిని సర్వీస్ నుంచి తొలగిస్తూ శని వారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల ఈ మోడల్ స్కూల్ విద్యార్థులను విజ్ఞాన యా త్రకు తీసుకెళ్లారు. ఈ క్రమంలో విద్యార్థినులతో ఈ ముగ్గురు ఉపాధ్యాయులు అనుచితంగా ప్రవర్తించినట్లు ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. విద్యార్థి సంఘాల నాయకులు డీఈవో, కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. స్పందించిన కలెక్టర్ రాజర్షిషా బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డీఈవోను ఆదేశించారు. విచారణ చేపట్టిన జిల్లా విద్యాశాఖాధికారి బాధ్యులైన ముగ్గురు ఉపాధ్యాయులను సర్వీస్ నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
‘సీఎం ప్రజావాణి’ సద్వినియోగం చేసుకోండి
కై లాస్‌నగర్: సీఎం ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం సిరికొండ, ఇచ్చోడ మండల కేంద్రాల్లోని ఎంపీడీవో కార్యాలయాల్లో బహిరంగ విచారణ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ రాజర్షిషా ప్రకటనలో తెలిపారు. కార్యక్రమానికి హాజరయ్యే అర్జీదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వసతులు కల్పించాలని పేర్కొన్నారు. ఆయా మండలాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment