బెల్లంపల్లి: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ బుధవారం విడుదల చేసిన మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఎక్స్‌టెన్షన్ గ్రేడ్–1 (సూపర్ వైజర్)పరీక్ష ఫలితాల్లో బెల్లంపల్లికి చెందిన సంహితరాజ్ సత్తా చాటింది. రాష్ట్రస్థాయిలో 21 ర్యాంక్, జోనల్ స్థాయిలో 4వ ర్యాంకు సాధించింది. పట్టణంలోని జీఎం కాలనీలో నివాసం ఉంటున్న కారంపూడి శ్రీనివాసరాజు–కృష్ణవేణి దంపతుల కుమార్తె అయిన సంహితరాజ్ గత నవంబర్‌లో వెలువడిన గ్రూప్–4 పరీక్ష ఫలితాల్లో జూనియర్ అసిస్టెంట్‌గా ఎన్నికై బెల్లంపల్లి మైనార్టీ బాలికల గురుకుల కళాశాలలో విధులు నిర్వహిస్తోంది. అంతటితో ఆగకుండా రోజుకు గరిష్టంగా 10 గంటల పాటు చదివి జనవరి 6, 7 తేదీల్లో నిర్వహించిన పరీక్షకు హాజరై ఎక్స్‌టెన్షన్ గ్రేడ్–1 ఉద్యోగానికి ఎంపికై ంది. తల్లి కృష్ణ బెల్లంపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో, తండ్రి శ్రీనివాసరాజు శాంతిఖనిగనిలో డెప్యూటీ సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. శ్రీనివాసరాజు కుమారుడు గత డిసెంబర్‌లో ప్రకటించిన సింగరేణి మేనేజ్‌మెంట్ ట్రెయినీ(అండర్ మేనేజర్)ఉద్యోగానికి ఎంపికయ్యాడు.