బాల్య వివాహం అడ్డగింత
నేరడిగొండ(బోథ్): మండలంలోని బొందిడి గ్రామంలో గురువారం అధికారులు బాల్యవివాహాన్ని అడ్డుకున్నారు. గ్రామానికి చెందిన ఇంటర్ విద్యార్థినికి అదే గ్రామానికి చెందిన యువకుడితో పెళ్లి చేయాలని పెద్దలు నిశ్చయించారు. విషయం తెలుసుకున్న అంగన్‌వాడీ సూపర్‌వైజర్ మంజుల జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్, చైల్డ్ హెల్ప్‌లైన్ సహకారంతో గ్రామానికి వెళ్లి వివాహాన్ని అడ్డుకున్నారు. గ్రామస్తులకు చైల్డ్ మ్యారేజ్ ప్రొబిషన్ యాక్ట్ గురించి వివరించారు. చైల్డ్ హెల్ప్‌లైన్ కోఆర్డినేటర్ సతీశ్, పీవోఐసీ స్వామి, సోషల్ వర్కర్ రవికాంత్, అంగన్‌వాడీ టీచర్, ఆశ వర్కర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment