
సద్వినియోగం చేసుకోవాలి
నిరుద్యోగ అభ్యర్థులకు ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకు అనుగుణంగా ఉచిత శిక్షణ అందిస్తున్నాం. గతేడాది 151 మంది ప్రభుత్వ ఉద్యోగాలు సాధించగా, ఈ ఏడాది గ్రూప్–1 ఫలితాల్లో 400కు పైగా మార్కులు సాధించిన వారు ఏడుగురు, గ్రూప్–2 ఫలితాల్లో 300కు పైగా మార్కులు సాధించిన వారు 17 మంది, గ్రూప్–3లో 250కి పైగా మార్కులు సాధించిన వారు ఐదుగురు ఉన్నారు. వీరిలో పది మందికి పైగా ఉద్యోగాలు వస్తాయని ఆశిస్తున్నాం. అలాగే ప్రస్తుతం ఆర్‌ఆర్‌బీ, బ్యాంకింగ్ ఉద్యోగ నియామకాల కోసం ఉచిత శిక్షణ అందిస్తున్నాం. జాబ్ క్యాలెండర్ ప్రకారం విడుదలయ్యే గ్రూప్స్, డీఎస్సీ, పోలీస్ కానిస్టేబుల్, ఎస్సై నియామకాల కోసం సైతం ఉచిత శిక్షణ అందిస్తాం. లైబ్రరీ, స్టడీ హాల్ ఉదయం 6 గంటల రాత్రి 9 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. నిరుద్యోగులు మమ్మల్ని సంప్రదిస్తే వారికి అవసరమైన సలహాలు, సూచనలు అందిస్తాం. నిరుద్యోగ అభ్యర్థులు స్టడీ సర్కిల్ సేవలు సద్వినియోగం చేసుకోవాలి.
– ప్రవీణ్‌కుమార్, బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్