● ఫిర్యాదుల సత్వర పరిష్కారానికి కృషి చేయాలి ● ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌టౌన్: ప్రతీపోలీస్‌స్టేషన్‌లో రిసెప్షన్ సెంటర్ల పాత్ర కీలకమైందని, ఫిర్యాదు చేసేందుకు వచ్చే బాధితులతో గౌరవంగా వ్యవహరించాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. జిల్లాలోని పోలీస్ స్టేషన్ల రిసెప్షనిస్టులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. సంబంధిత పోలీసు అధికారులతో వీడి యో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. స్టేష న్‌కు వచ్చే ఫిర్యాదుదారులతో గౌరవంగా వ్యవహరిస్తూ బాధితులకు సత్వర న్యాయం అందించేలా కృషి చేయాలన్నారు. జిల్లాలోని ప్రతీ గ్రామానికి విలేజ్ పోలీస్ ఆఫీసర్ ఉండేలా చూడాలన్నారు. ఫిర్యాదులు స్వీకరించిన వెంటనే స్టేషన్ ఇన్‌చార్జి సంబంధిత విలేజ్ పోలీస్ ఆఫీసర్‌కు అప్పగించి సరైన దర్యాప్తు కొనసాగించేలా చూడాలన్నారు. సంఘటన స్థలంలో ఉన్న సాక్షుల వాంగ్మూలం నమో దు చేసి వారి సంతకాలతో కూడిన రిపోర్టును రిసెప్షనిస్టుకు అందజేయాలన్నారు. ఒకవేళ రాజీ పొందితే రాజీ పత్రంపై ఇరు వర్గాలు, సాక్షుల సంతకాలతో కూడిన పత్రాలను నమోదు చేసుకోవాలని సూచించారు. ఎంక్వయిరీ అధికారి తన దర్యాప్తుతో పాటు సెల్ఫీతో కూడిన ఛాయాచిత్రాన్ని రిపోర్టులో పొందుపరచాలని తెలిపారు. ప్రతీ ఫిర్యాదును ఆన్‌లైన్‌లో నమోదు చేసి దర్యాప్తు చేపట్టాలన్నారు. నెలలో ప్రతీవారం సీఐ స్థాయి అధికారులు తమ స్టేషన్లలో జరిగే రిసెప్షన్ వర్టికల్‌పై ప్రత్యేక చొరవ తీసుకొని సమీక్షించాలని తెలిపారు. ఇందులో స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ పోతారం శ్రీనివాస్, డీసీఆర్బి సీఐ పాండేరావు, సిబ్బంది పాల్గొన్నారు.
పోలీసుశాఖ ఆధ్వర్యంలో ఇఫ్తార్
ఆదిలాబాద్‌టౌన్: పోలీస్ సిబ్బంది సోదరాభావంతో ఐకమత్యంగా ఉండాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. శాంతి సామరస్యాలతో సంతోషకర జీవి తాన్ని గడపాలని ఆకాంక్షించారు. శుక్రవారం సా యంత్రం స్థానిక పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో ముస్లిం పోలీస్ సిబ్బందికి ఏర్పాటు చేసిన ఇఫ్తార్‌లో ఆయ న పాల్గొన్నారు. ప్రత్యేక ప్రార్థనల అనంతరం ఉపవాస దీక్షలు విరమించారు. ఇందులో డీఎస్పీలు శ్రీనివాస్, జీవన్‌రెడ్డి, హసీబుల్లా, పట్టణ సీఐలు, రిజర్వ్‌ఇన్‌స్పెక్టర్లు, ఎస్సైలు సిబ్బంది పాల్గొన్నారు.