
● రాష్ట్ర మంత్రులు పొంగులేటి, సీతక్క ● భోరజ్ మండలం పూస
ఆదిలాబాద్‌టౌన్: భూ భారతితో రైతుల కష్టాలన్నీ తీరుతాయని, భూ సమస్యలన్నీ పరిష్కృతమవుతా యని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీని వాస్‌రెడ్డి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అ న్నారు. భోరజ్ మండలం పూసాయి గ్రామంలో శు క్రవారం నిర్వహించిన భూ భారతి అవగాహన సదస్సులో ఇద్దరు మంత్రులతో పాటు ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేశ్, ఎమ్మెల్సీ దండే విఠల్, ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, వెడ్మ బొజ్జు, ఆర్థిక శాఖ ముఖ్య కా ర్యదర్శి కె.రామకృష్ణారావు హాజరై మాట్లాడారు. హౌసింగ్ శాఖ ముఖ్య కార్యదర్శి బుద్ధప్రకాశ్, డీసీ సీబీ చైర్మన్ భోజారెడ్డి, కలెక్టర్ రాజర్షి షా, ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా, ఎస్పీ అఖిల్ మహాజన్, అదనపు కలెక్టర్ శ్యామలాదేవి పాల్గొన్నారు.
సందేహాలను నివృత్తి చేసిన మంత్రి పొంగులేటి
మంత్రులు పొంగులేటి, సీతక్క హెలిక్యాప్టర్ ద్వా రా జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌లో దిగారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా భోరజ్ మండలం పూసాయికి 3.30 గంటల ప్రాంతంలో చేరుకున్నారు. ఆ తర్వాత అవగాహన సదస్సు ప్రా రంభమైంది. మొదట పలువురు రైతులు తాము ధరణితో ఎదుర్కొన్న సమస్యలను సదస్సులో వివరించారు. అనంతరం ప్రజాప్రతినిధులు ఒక్కొక్కరు గా మాట్లాడారు. ఎంపీ మాట్లాడుతూ భూ భారతిలోని కొన్ని అంశాలపై సందేహాలు అడిగినప్పుడు స్వయంగా మంత్రి పొంగులేటి సమాధానం ఇచ్చా రు. ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు మాట్లాడుతూ, తాను జిల్లాలో కలెక్టర్‌గా పనిచేసిన కాలంలో అనుభవాలను పంచుకున్నారు. గతంతో పోల్చితే ఆదిలాబాద్ అభివృద్ధి చెందిందన్నారు. భూభారతి ద్వారా రైతులు ఎదుర్కొంటున్నసమస్య ల పరిష్కారానికి చర్యలు చేపడతామని తెలిపారు.
కాంగ్రెస్, బీజేపీ నాయకుల మధ్య రగడ
కాంగ్రెస్ నాయకులు కొందరు స్టేజీపైన కూర్చోవడంతో అక్కడికి వచ్చిన బీజేపీ నాయకులు వారిని కిందికి దించాలని ఆందోళనకు దిగారు. దీంతో పలువురు కాంగ్రెస్, బీజేపీ నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తోపులాట జరగడంతో సభలో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. పోలీసులు ఇరు పార్టీల నాయకులకు నచ్చజెప్పినా వినకపోవడంతో బలవంతంగా అక్కడినుంచి పంపించారు. ఎమ్మెల్యే పాయల్ శంకర్ కాంగ్రెస్ నాయకులను సముదాయించారు. రైతుల కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆందోళన చేపట్టవద్దని మంత్రి సీతక్క సూచించారు. దీంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఆ తర్వాత కార్యక్రమం యథావిధిగా కొనసాగింది. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఆదిలా బాద్, బోథ్ నియోజకవర్గాల ఇన్‌చార్జీలు కంది శ్రీనివాసరెడ్డి, ఆడే గజేందర్, ఆత్రం సుగుణ, కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి, జైనథ్ మార్కెట్ కమిటీ చైర్మన్ అశోక్‌రెడ్డి, ఆర్డీఓ వినోద్ కుమార్, తహశీల్దార్లు రాజేశ్వరి రాథోడ్, నలందప్రియ, తదితరులు పాల్గొన్నారు.