
నా పేరు నగేశ్. కర్నాటకలోని శివమొగ్గ జిల్లాలో మా ఊరు ఉంది. పేరుకు శివమొగ్గ అని జిల్లా పేరు చెప్పాను. కానీ నాకంటూ సొంత ఇళ్లు , సొంత కుటుంబం, సొంత ఊరంటూ లేదు. నాకు ఐదేళ్ల వయస్సుప్పుడే నా తల్లిదండ్రులు చనిపోయారు. అప్పటి నుంచి ఫుట్‌పాత్‌లే నా ఇళ్లుగా మారాయి. ఒక్క పూట తిండి దొరక్క కన్నీళ్లతో కడుపు నింపుకున్న రోజులు ఉన్నాయి.
తల్లిదండ్రులు లేక దారి తెన్ను లేకుండా గడిచిపోతున్న నా జీవితానికి సుమనహళ్లి ట్రస్టు రూపంలో ఓ భరోసా దొరికింది. ఉండటానికి ఇళ్లు, తినడానికి తిండి లేని నన్ను ఓ అనాథ ఆశ్రమంలో చేర్చింది. అక్కడే నా అంటూ లేని నా వాలాంటి వాళ్లతో ఓ కుటుంబం ఏర్పడింది. పెద్దయ్యాక ఏదైనా పని చేసి కడుపు నిండా ఇష్టమైన తిండి తినాలని, మంచి బట్టలు కట్టుకోవాలని, గౌరవంగా జీవించాలని అనుకునే వాడిని
టీనేజీలో ఉన్నప్పుడే నా కాలి చర్మం మీద చిన్న కురుపులు వచ్చాయి. మూడు పూటల తిండి దొరకడమే అదృష్టమనుకునే ఆ సమయంలో కాలిపై వచ్చిన చిన్న కురుపులను పట్టించుకోలేదు. చూస్తుండగానే అది అలా పెరిగి పెద్దదయ్యింది. 2018 వచ్చే సరికి నడవడం కష్టం అనిపించే స్థాయికి నా కాళ్లు వాచిపోయాయి.
ట్రస్టు సభ్యుల సహాకారం మరికొందరు మనసున్న మనుషుల సాయంతో ఆస్పత్రికి వెళ్లాను. అక్కడ నన్ను పరిశీలించిన డాక్టర్లు నాకు వచ్చిన ఆరోగ్య సమస్యని లింఫెడెమా ఎలిఫెన్షియాసిస్‌గా తేల్చారు. ఈ సమస్య కారణంగా అడుగు తీసి అడుగు వేయడం భారంగా ఉండేది. చూడటానికి నా కాళ్లు ఎంతో వికారంగా కనిపించేవి.
ఒక వయస్సు వచ్చాక పని చేసుకుని గౌరవంగా బతుకుదామని ఎవరి దగ్గరికి వెళ్లినా నా కాళ్లను చూసి పని ఇచ్చే వారు కాదు. ఇదే సమయంలో నా పాదాల నుంచి పై వరకు కాళ్లంతా బాగా వాచి పోయాయి. మంచానికే పరిమితమయ్యే దుస్థితిలోకి జారిపోయాను.
నా సమస్యను గమనించిన డాక్టర్లు ఓ పరిష్కారం చెప్పారు. కాళ్లు సాధారణ స్థితికి రావాలంటే మూడు సార్లు ఆపరేషన్ చేయడంతో పాటు మెడిసిన్స్ వాడాలన్నారు. దీని కోసం రూ. 30,00,000 (ముప్పై లక్షలు) ఖర్చు వస్తుందన్నారు. భోజనం చేయడమే గగనం అనిపించే నాకు అంత డబ్బు సమకూర్చుకోవడం కలలో కూడా సాధ్యమయ్యే పని కాదు.
కానీ తల్లిదండ్రులు లేని స్థితి నుంచి ఈ రోజు వరకు బతికి ఉన్నానంటే.. దానికి కారణం ఈ సమాజం నాపై చూపించిన ప్రేమ, కరుణ. ట్రస్టు , అనాథ శరణాలయం రూపాల్లో ఆ దైవం నాకు ఏదో రకంగా సాయం అందిస్తూనే ఉన్నాడు. అందుకే మరోసారి నా ఆపరేషన్‌కి అవసరం అయ్యే డబ్బులను సాయంగా అందివ్వమని కెట్టో ద్వారా మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఆపరేషన్ చేసుకుని బాగైన తర్వాత ఏదైనా పని చేసుకుని గౌరవంగా బతకాలని ఆశపడుతున్నాను. (అడ్వర్టోరియల్)
Comments
Please login to add a commentAdd a comment