రితికా సమద్దర్, చీఫ్ డైటీషియన్, మ్యాక్స్ హెల్త్‌కేర్, శాకెట్, న్యూఢిల్లీ
మిఠాయిలను ప్రతి ఒక్కరూ వీటిని ఆస్వాదిస్తారు. అయితే ఆరోగ్యం విషయంగా నోరూరించే మిఠాయిలు, ఆహార పదార్దాల నుంచి నియంత్రణ పాటించడం కష్టసాధ్యమే.
నా సలహా: ఆహారం తీసుకోవచ్చుగానీ తక్కువ పరిమాణంలోనే. అందులోనూ ఆరోగ్యం, పరిశుభ్రత పట్ల ఈ ఏడాది మరింత శ్రద్ధ తీసుకోవలసి ఉంది. పని, జీవన విధానంలో భారీగా మార్పులు వచ్చిన నేపథ్యంలో ప్రతీదాన్నీ ఇంట్లోనే తయారు చేసుకోవాలంటే కష్టమే. ఆరోగ్యం, పోషకాలు, రుచి వంటివి బ్యాలన్స్ చేసుకోవలసి ఉంటుంది. ఇందుకు వీలుగా ఇక్కడ కొన్ని సులభమైన టిప్స్ ఇస్తున్నాం. వీటి ద్వారా పోషకాలతో కూడిన ఆహారంతో దీపావళిని భద్రంగా, ఆరోగ్యంగా జరుపుకోండి.
పోషకాహారం: పండుగల సీజన్‌లో మిఠాయిలనుంచి తప్పించుకోవడం కష్టమే. వీటికి బదులుగా నోరూరించే ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలను ఎంచుకోండి. బేక్‌డ్ ఫుడ్స్‌కు బదులుగా ఫ్రైడ్ కజ్జికాయలు లేదా జంతికలను ఎంపిక చేసుకోవచ్చు. ఆరోగ్యకరమైన ఆల్మండ్స్, వాల్‌నట్స్‌ను జత చేసుకోవచ్చు. సహజసిద్ధ చక్కెరలాగ ఫిగ్స్‌ను వినియోగించవచ్చు. ఇదేవిధంగా లేబుల్‌పై పోషకాల వివరాలు స్పష్టంగా తెలిపే ఐస్ క్రీమ్ వంటి ప్యాక్‌డ్ డెజర్ట్స్‌ను ఎంచుకోవచ్చు.
సులభంగా, రుచికరంగా: గత కొద్ది నెలలుగా మనలో చాలా మంది జీవన విధానం, కార్యకలాపాలను మార్చుకోవలసి వచ్చింది. ఇళ్లలోనే గడపడం ద్వారా రోజువారీ పనులు పెరిగిపోయాయి. ఇంటి శుభ్రత, ఇంటిలోనే పిల్లల చదువులు, ఇంటి నుంచే ఆఫీస్ వర్క్ వంటి చేపట్టవలసి వచ్చింది. కొన్ని రకాల స్వీట్స్ తయారు చేయడం ద్వారా పని ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. అలాగే కొన్ని ఇన్‌గ్రెడియంట్స్‌ను మిక్స్ చేసి మ్యాచ్ చేయడం ద్వారా సమయాన్ని ఆదా చేసుకోవచ్చు. రుచికరంగా చేసుకోవచ్చు. (యుమ్మీ క్యోషియంట్). ఉదాహరణకు కొన్ని రకాల డ్రైఫ్రూట్స్‌ను చిన్నచిన్న ముక్కలుగా తరగడం ద్వారా ఐస్‌క్రీమ్‌పై అందంగా అలంకరించవచ్చు. ఇదేవిధంగా కొన్ని తాజా పండ్లను సైతం ముక్కలుగా కోసుకుని పోషకాలతో కూడిన డిజర్ట్‌గా రూపొందించుకోవచ్చు.
సురక్షితంగా: ఆహారాన్ని ఎంపిక చేసుకుటప్పుడు ఈ ఏడాది జాగ్రత్త వహించవలసి ఉంది. స్థానిక స్టోర్ల నుంచి ప్యాకింగ్ లేని స్వీట్లు వంటివి ఎంపిక చేసుకోవడం కంటే ఇంటివద్దనే తయారు చేసుకోవడం మేలు. అయితే అన్ని రకాలనూ వండుకోవాలంటే ఒత్తిడి పడుతుంది. నా అనుభవంలో చెప్పాలంటే ప్యాకేజ్‌డ్, ఫ్రోజెన్ ఫుడ్, డెజర్ట్స్ వంటివి వీటికి ప్రత్యామ్నాయంగా ఎంచుకోవచ్చు. ఎందుకంటే వీటి తయారీలో అత్యంత పరిశుభ్రతా ప్రమాణాలు పాటిస్తాయి. వెరసి మీరు రుచి, సురక్షితలతో కూడిన ఉత్పత్తులను వినియోగించవచ్చు. (Advertorial)
Comments
Please login to add a commentAdd a comment