
తాళం వేసి ఉన్న అంగన్‌వాడీ కేంద్రాన్ని తెరుస్తున్న అధికారులు
రాజవొమ్మంగి: క్రమం తప్పకుండా పిల్లలకు తల్లులకు పౌష్టికాహారం అందించాల్సిన అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు వారికి మూడు రోజులుగా పస్తులు వుంచడం సమంజసం కాదని రాజవొమ్మంగి సీడీపీఓ దేవమణి పేర్కొన్నారు. కలెక్టర్, సీ్త్ర శిశు సంక్షేమశాఖ పీడీ ఆదేశాల మేరకు ఆమె రాజవొమ్మంగిలో తాళం వేసి ఉన్న అంగన్‌వాడీ కేంద్రాన్ని తెరిచారు. ఆమె వెంట సచివాలయ సిబ్బంది, మహిళళా పోలీసులున్నారు. మూసి ఉన్న అంగన్‌వాడీ కేంద్రం తెరవడంపై అంగన్‌వాడీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ మేరకు సచివాలయ సిబ్బంది, అంగన్‌వాడీ యూనియన్ సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకి చేరుకొని పరిస్థితిని చక్కదిద్దారు. అయితే ఆందోళనకారులు తిరిగి అంగన్‌వాడీ కేంద్రానికి తాళం వేయడం గమనార్హం.
వసతి గృహాల్లో కట్టుదిట్టమైన భద్రత
హుకుంపేట: మండల కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ కళాశాల బాలికల వసతి గృహాన్ని ఎంపీపీ కూడా రాజుబాబు గురువారం సందర్శించారు. వసతి గృహాల్లో ఎటువంటి అల్లర్లు లేకుండా కట్టుదిట్టమైన భద్రతను అధికారులు కల్పించాలన్నారు. వసతి గృహాల్లో వార్డెన్ అందుబాటులో ఉండడం లేదని, వసతి గృహాల్లో పరిశుభ్రత లేకపోవడంతో ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. వసతి గృహాల్లో పరిసరాల పరిశుభ్రతతో పాటు, బయట వ్యక్తులకు ప్రవేశం లేకుండా తగు చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. వారానికి రెండు సార్లు వైద్య సిబ్బంది ద్వారా పరీక్షలు చేయించాలని సూచించారు. డిప్యూటీ డీఈవో సోమేలి చెల్లయ్య, ఎంఈవో ఈశ్వరరావు, వార్డెన్ కన్యాకుమారి తదితరులున్నారు.

విద్యార్థులతో మాట్లాడుతున్న ఎంపీపీ రాజుబాబు
Comments
Please login to add a commentAdd a comment