![లాహిరి లాహిరి లాహిరిలో..](/styles/webp/s3/article_images/2025/01/30/29vscp148-600486_mr-1738178575-0.jpg.webp?itok=lBFuNucQ)
లాహిరి లాహిరి లాహిరిలో..
సింహాచలం: పుష్య బహుళ అమావాస్యను పురస్కరించుకుని శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి తెప్పోత్సవం బుధవారం కనులపండువగా జరిగింది. శ్రీదేవి, భూదేవి సమేతుడై స్వామివారు వేణుగోపాలస్వామిగా దర్శనమిచ్చాడు. హంస వాహనంపై నౌకావిహారంలో కనువిందు చేశాడు. ఉత్సవాన్ని తిలకించేందుకు వచ్చిన భక్తులతో వరాహపుష్కరిణి కిటకిటలాడింది. సాయంత్రం సింహగిరి నుంచి మెట్లమార్గం ద్వారా కొండదిగువకి తొలిపావంచా వద్దకు చేరుకున్న స్వామికి అధికారులు, అడవివరం గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి ఊరేగింపుగా వరాహ పుష్కరిణి వద్దకు తీసుకెళ్లారు. శోభాయమానంగా అలంకరించిన హంసాకృతి నౌకపై స్వామిని కొలువుంచి, తెప్పోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. మండపంలో స్వామిని వేంజేపచేసి విష్వక్సేణపూజ, పుణ్యాహవచనం, షోడషోపచార పూజలు, విశేష ఆరాధనలు, పారాయణాలు జరిపారు. ఆ తర్వాత స్వామిని పుష్కరిణి సత్రం వద్దకు తీసుకొచ్చి సర్వజన మనోరంజని వాహనంపై గ్రామ తిరువీధిని విశేషంగా నిర్వహించారు. దేవస్థానం ఈవో త్రినాథరావు, దేవస్థానం స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్, ప్రధానార్చకుడు గొడవర్తి శ్రీనివాసాచార్యులు, పురోహిత్ అలంకారి కరి సీతారామాచార్యులు, అర్చకులు, వేద పండితులు, పారాయణదారులు ఈ ఉత్సవాన్ని నిర్వహించారు.
తొలిసారిగా ఏపీఎస్‌ఆర్‌డీఎఫ్ సేవలు
తెప్పోత్సవానికి అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేశా రు. వరాహ పుష్కరిని, హంస వాహనాన్ని సుందరంగా అలంకరించారు. విద్యుద్దీపాలంకరణ చేశారు. గోపాలపట్నం లా అండ్ ఆర్డర్ సీఐ గొలగాని అప్పారావు ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. తొలిసారిగా ఏపీఎస్‌ఆర్‌డీఎఫ్ బృందం భద్రతా చర్యలకు వచ్చింది. రెండు బోట్లు, 15 మంది సిబ్బంది తెప్పోత్సవానికి తరలి వచ్చారు.
తెప్పోత్సవంని తిలకిస్తున్న భక్తులు
తెప్పోత్సవంలోహంస వాహనంపై అప్పన్న
వేణుగోపాలస్వామిగా భక్తులకు దర్శనం
Comments
Please login to add a commentAdd a comment