అథ్లెటిక్స్‌లో మెరిసిన గిరిజనుడికి అభినందనలు
ముంచంగిపుట్టు: రాజస్థాన్ రాష్ట్రం ఆళ్వార్‌లో ఇటీవల నిర్వహించిన 44వ నేషనల్ మాస్టర్స్ వెటరన్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ పరుగుల పోటీల్లో సత్తా చాటిన పెదగూడ పంచాయతీ జర్రిపడ గ్రామానికి చెందిన అథ్లెటిక్స్ కుర్తాడి ప్రసాద్‌కు శనివారం అభినందన సభ నిర్వహించారు. 800, 400, 1500 మీటర్ల విభాగాల్లో వెండి, రెండు కాంస్య పతకాలు సాధించిన ఆయనను ఇన్‌చార్జీ ఎంపీడీవో సూర్యనారాయణమూర్తి, ఎంఈవో కృష్ణమూర్తి, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు రమేష్, గిరిజన మహిళా సంఘం అధ్యక్షురాలు ఈశ్వరి సన్మానించారు. మారుమూల గిరిజన గ్రామంలో పుట్టి, ఇంత వయసులోనూ పరుగులో అంతర్జాతీయ స్థాయిలో పతాకాలు సాధించి, మండలానికి మంచి పేరు తీసుకురావడం గర్వకారణమని, మరిన్ని పతాకాలు సాధించాలని వారంతా ఆకాంక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment