తాగునీటి బోర్ల మరమ్మతులకు సామగ్రి సిద్ధం
● రక్షిత తాగునీటి పథకాలకు
ముందస్తు మరమ్మతులు
● ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈ జవహర్‌కుమార్
సాక్షి,పాడేరు: కలెక్టర్,తమశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తాగునీటి బోర్ల మరమ్మతులకు సామగ్రిని సిద్ధం చేశామని ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈ జవహర్‌కుమార్ తెలిపారు.శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ చేతిపంపుల మరమ్మతుల పనులను అన్ని మండలాల్లో ప్రారంభించినట్టు చెప్పారు.రక్షిత తాగునీటి సరఫరా పథకాలకు ముందస్తుగానే మరమ్మతులు చేపడుతున్నట్టు తెలిపారు. ప్రతి నెల మొదటి, మూడవ శనివారాల్లో స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా తాగునీటి పథకాలు ట్యాంకులు,ఆయా నీటి వనరుల్లో క్లోరినేషన్‌కు చర్యలు తీసుకున్నామన్నారు. ఇంజినీరింగ్ అధికారులు,బోర్ల మెకానిక్‌లు గ్రామాల్లో పర్యటిస్తూ పాడైన బోరుబావులు,తాగునీటి పథకాలను గుర్తించి, వినియోగంలోకి తెస్తున్నారని తెలిపారు. జల్‌జీవన్ మిషన్ కింద మంజూరైన పనులను మార్చి 15నాటికి పూర్తి చేసే లక్ష్యంతో ఉన్నామని ఆయన చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment