పరిసరాల పరిశుభ్రతతో ఆరోగ్యకర సమాజం
సాక్షి,పాడేరు: పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకర సమాజం సాధ్యమని కలెక్టర్ ఎ.ఎస్.దినేష్‌కుమార్ అన్నారు. స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణ ఆంధ్ర కార్యక్రమాన్ని శనివారం పంచాయతీ కేంద్రం మినుములూరులో నిర్వహించారు.ఈ సందర్భంగా గ్రామస్తులతో మానవహారం ఏర్పాటు చేశారు. అనంతరం కలెక్టర్ వారి తో ప్రతిజ్ఞ చేయించారు. పలువురి గిరిజనుల నివాసాలను కలెక్టర్ సందర్శించారు.పారిశుధ్య కార్యక్రమాలపై అవగాహన కల్పించారు.మినుములూరులోని సంపద తయారీ కేంద్రం సేవలను ప్రజలు సద్విని యోగం చేసుకోవాలన్నారు. సంపద కేంద్రాలకు బదులుగా గ్రామాల్లో షెడ్లు నిర్మిస్తామని తెలిపారు. సర్పంచ్ లంకెల చిట్టెమ్మ, డీపీవో లవరాజు, డీఎల్‌పీవో పి.ఎస్.కుమార్, ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈ జవహర్‌కు మార్, ఈవోపీఆర్‌డీ రమేష్, పంచాయతీ కార్యదర్శు లు చిన్ని,అనూష పాల్గొన్నారు.
పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత
పరిసరాల పరిశుభ్రతలో అన్నిశాఖల అధికారులు,ఉద్యోగులు భాగస్వా ములు కావాలని డీఆర్‌వో కె.పద్మలత కోరారు.కలెక్టరేట్‌లో శనివారం స్వర్ణాంఽధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. పరిసరాల పరిశుభ్రతపై అధికారులతో ఆమె ప్రతిజ్ఞ చేయించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు.అనంతరం కలెక్టరేట్‌లోని అన్ని విభాగాల్లోను అధికారులు,సిబ్బంది చెత్తాచెదారాన్ని తొలగించారు. డీఆర్‌వో పద్మలత మొక్కలు నాటారు. కలెక్టరేట్‌లోని సమాచార పౌరసంబంధాలశాఖ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో డీపీ ఆర్‌వో గోవిందరాజులు,డివిజనల్ పీఆర్‌వో పండు రాములు, సిబ్బంది పాల్గొన్నారు.
గ్రామాల్లో మినీషెడ్ల ఏర్పాటుకు చర్యలు
కలెక్టర్ దినేష్‌కుమార్
పరిసరాల పరిశుభ్రతతో ఆరోగ్యకర సమాజం
Comments
Please login to add a commentAdd a comment