సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామికి ఆదివారం హరేకృష్ణ మూవ్‌మెంట్ సుమారు రూ.10 లక్షలు విలువ చేసే రెండు బంగారు శఠగోపాలు(వెండిపై బంగారు పూత) బహూకరించింది. గ్లోబల్ హరేకృష్ణ మూవ్‌మెంట్ చైర్మన్ పద్మశ్రీ అవార్డు గ్రహీత మధుపండితదాస సింహగిరికి వచ్చి శఠగోపాలను ఆలయ ఏఈవో ఆనంద్‌కుమార్, ప్రధానార్చకుడు గొడవర్తి శ్రీనివాసాచార్యులకు అందజేశారు.
సంస్థ సభ్యులతో కలిసి స్వామి ఆరాధన కార్యక్రమంలో పాల్గొన్నారు. దేవస్థానం తరపున అధికారులు మధుపండిత దాసకు, ఆయనతో వచ్చిన సంస్థ సభ్యులకు స్వామి దర్శనం కల్పించి ప్రసాదం, శేషవస్త్రాలను అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment