జేఈఈ మెయిన్స్‌లో సత్తా చాటిన తుంగమడుగుల విద్యార్థి
అడ్డతీగల: మండలంలో తుంగమడుగులకు చెందిన పీరు ప్రణవ రుద్రేష్‌రెడ్డి జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటాడు. 97.45 పర్సంటైల్‌తో ఉత్తమ ప్రతిభ కనబరిచినట్టు రుద్రేష్‌రెడ్డి తండ్రి పీరు చింతలబ్బాయి తెలిపారు. మద్రాస్ ఐఐటీలో కంప్యూటర్ సైన్స్‌లో బీటెక్ చేసి, అనంతరం సివిల్స్ సాధించి, పేద ప్రజలకు సేవ చేయాలన్నది తన లక్ష్యమని రుద్రేష్‌రెడ్డి ఈ సందర్భంగా చెప్పాడు. తండ్రి ఫిజికల్ డైరెక్టర్‌గా తూర్పు గోదావరి జిల్లా సీతానగరం మండలం వెదుళ్లపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్నారు. తల్లి ఎస్‌జీటీ టీచర్‌గా తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం నరేంద్రపురం ఎంపీపీ పాఠశాలలో పనిచేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment