బెంజ్ లారీ ఢీకొని బతుకు ఛిద్రం
అనకాపల్లి : చేతికి అంది వస్తాడనుకున్న కుమారుడు గుణ తేజశ్వంత్ (17) రోడ్డు ప్రమాదంలో ఆదివారం మృత్యువాత పడడంతో ఆ కుటుంబ సభ్యులు భోరున విలపించారు. పట్టణంలో వేల్పులవీధికి చెందిన గుణ తేజశ్వంత్ విజయరామరాజుపేటకు చెందిన యర్రంశెట్టి హర్షవర్ధన్‌లు పట్టణంలో ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. గుణ తేజశ్వంత్ శనివారం యలమంచిలి మండలం పద్మనాభపేట గ్రామంలో ఓ శుభకార్యానికి తన తల్లి యశోదతో కలిసి వెళ్లారు. ఆదివారం ఉదయం అల్పాహారం తీసుకుని వారి ఇంటికి వచ్చారు. మధ్యాహ్నం భోజనం కోసం జాతీయ రహదారి ఉమ్మలాడ జంక్షన్ వద్ద హాటల్‌కు వెళ్లి బిరియాని తీసుకుని వస్తామని చెప్పి స్నేహితులైన విజయరామరాజుపేటకు చెందిన హర్షవర్ధన్, ధనుష్‌లతో కలిసి రెండు ద్విచక్రవాహనాలపై హోటల్‌కు వెళ్లారు. హర్షవర్థన్ బైక్‌పై గుణ తేజశ్వంత్, హర్షవర్థన్‌లు బయలు దేరారు. మరో బైక్‌పై ధనుష్ వెళ్లిపోయాడు. ముగ్గురూ ఉమ్మలాడ జంక్షన్ వద్ద హోటల్‌ల్లో భోజనం చేసి, తల్లికి భోజనం పట్టుకుని తిరిగి ఇంటికి బయలుదేరారు. జంక్షన్ వద్ద జాతీయ రహదారి దాటుతున్న సమయంలో యలమంచిలి నుంచి విశాఖ వెళుతున్న బెంజ్ లారీ గుణ తేజశ్వంత్, హర్షవర్థన్ బైక్‌ను వెనుక నుంచి ఢీకొట్టింది.
ఈ దుర్ఘటనలో తేజశ్వంత్ అక్కడిక్కడే మృతిచెందగా, హర్షవర్ధన్ తలకు తీవ్రగాయమైంది. స్థానికులు, ట్రాఫిక్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించి, క్షతగాత్రుడు హర్షవర్ధన్‌కు ఎన్టీఆర్ ఆస్పత్రిలో చికిత్స చేయించి, మెరుగైన వైద్యం కోసం విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. ఈ ఘటనపై మృతుడు తల్లి యశోద ఇచ్చిన ఫిర్యాదు మేరకు ట్రాఫిక్ ఎస్‌ఐ డి.శేఖరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో ఇంటర్ విద్యార్థి మృతి
మరో యువకుడికి తీవ్ర గాయాలు
బెంజ్ లారీ ఢీకొని బతుకు ఛిద్రం
బెంజ్ లారీ ఢీకొని బతుకు ఛిద్రం
బెంజ్ లారీ ఢీకొని బతుకు ఛిద్రం
బెంజ్ లారీ ఢీకొని బతుకు ఛిద్రం
Comments
Please login to add a commentAdd a comment