అథ్లెటిక్స్‌లో నేవీ ఉద్యోగికి బంగారు పతకం
దేవరాపల్లి : దేవరాపల్లి మండలం రైవాడ పంచాయితీ శివారు శంభువానిపాలేనికి చెందిన నేవీ ఉద్యోగి ఉగ్గిన అప్పన్నదొర జాతీయ స్థాయి అథ్లెటిక్స్‌లో పోటీల్లో బంగారు పతకాన్ని సాధించారు. సామాన్య గిరిజన కుటుంబానికి చెందిన అప్పన్నదొర రాజస్థాన్‌లో ఈ నెల 6 నుంచి 8 వరకు జరిగిన జాతీయ స్థాయి అథ్లెటిక్స్ క్రీడా పోటీల్లో 45 సంవత్సరాల విభాగంలో 4‘‘400 రిలే పరుగు పందెంలో బంగారు పతకాన్ని సొంతం చేసుకున్నారు. అలాగే 4‘‘100 రిలే పరుగు పందెం, 200 మీటర్ల పరుగు పందెంలో వెండి పతకాలను సాధించారు. లాంగ్ జంప్, ట్రిపుల్ జంప్‌లో కాంస్య పతకాలను సాధించారు.
అప్పన్న దొరకు ఘనంగా పౌర సన్మానం
క్రీడా పోటీల్లో సత్తా చాటి జాతీయ స్థాయిలో తమ గ్రామానికి గుర్తింపు తెచ్చిన అప్పన్నదొరను శంభువానిపాలెం గ్రామస్తులు ఆదివారం పౌర సన్మానం చేశారు. అభినందనలతో ముంచెత్తారు. అప్పన్న దొర క్రీడా స్ఫూర్తిని ప్రతీ ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలంటూ పౌర సన్మానంలో పాల్గొన్న పంచాయతీ పెద్దలు చల్లా నాయుడు, చల్లా నానాజీ, ఉగ్గిన దేముళ్లు స్థానిక యువతకు సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment