సివిల్ సర్వీసెస్ అథ్లెటిక్ పోటీలకు పీడీ పోతురాజు
రంపచోడవరం: ముసురుమిల్లి గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో ఫిజికల్ డైరెక్టర్(పీడీ)గా పనిచేస్తున్న కలుముల పోతురాజు ఆలిండియా సివిల్ సర్వీసెస్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే అవకాశాన్ని దక్కించుకున్నారు. సివిల్ సర్వీసెస్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ 2024–25కు సంబంధించి ఈ నెల 19 నుంచి 21 వరకు పంజాబ్ రాష్ట్రం చండీగఢ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ సెక్టార్ –7లో జరిగే మీట్‌కి ఏపీ నుంచి ఆయన పాల్గొననున్నారు. అథ్లెటిక్స్‌లో 800 మీటర్ల పరుగు పందెంలో ఎంపికై నట్లు పోతురాజు తెలిపారు. స్పోర్ట్స్ మీట్‌లో పాల్గొనేందుకు ఏడు రోజుల పాటు స్పెషల్ క్యాజువల్ లీవ్‌లు, ఖర్చులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు అందాయి. స్పోర్ట్స్ మీట్‌కు ఎంపికై న ఆయనను హెచ్‌ఎం ఆదివిష్ణుదొర, అల్లూరి వ్యాయామ ఉపాధ్యాయుల అసోసియేషన్ అధ్యక్షుడు కృష్ణారావు, పీడీ చిన్నస్వామిరెడ్డి, తిరుపతిరావు, ధర్మరాజు, నాగిరెడ్డి, ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment