నాణ్యమైన విద్యతో పాటు మంచి ఆహారాన్ని అందించాలి
చింతపల్లి: గురుకుల విద్యార్థులతో పాటు ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మంచి ఆహారాన్ని అందించేందుకు చర్యలు చేపట్టాలని చింతపల్లి ప్రథమశ్రేణి జుడీషియల్ మెజిస్ట్రేట్ రోహిత్ అన్నారు. స్థానిక గిరిజన గురుకుల జూనియర్ కళాశాల,ఏకలవ్య పాఠశాలతో పాటు బాలురు,బాలికల ఆశ్రమ పాఠశాలలను ఆదివారం ఆయన సందర్శించారు.ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడారు. బోధన, భోజన సౌకర్యం,తాగునీరు,మరుగుదొడ్ల సౌకర్యంతో పాటు పరిసరాల పరిశుభ్రత గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment