అరకు క్వెస్ట్‌లో విజేతలకు బహుమతుల ప్రదానం
పాడేరు: అరకు చలి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించి ద గ్రేట్ అరకు క్వెస్ట్‌లో గెలుపొందిన వారికి కలెక్టర్ దినేష్‌కుమార్ ఆదివారం తన క్యాంప్ కార్యాలయంలో బహుమతులు అందజేశారు. మొదటి బహుమతి పొందిన ధృవ అండ్ టీంకు రూ.50వేలు, రెండో బహుమతి పొందిన మంగతల్లి అండ్ టీంకు రూ.30వేలు, మూడో బహుమతి పొందిన హెచ్.బి. భాస్కర్‌రెడ్డి అండ్ టీంకు రూ.20వేల నగదు అందజేశారు. బొర్రా గుహల నుంచి అరకులోయ వరకు నిర్వహించిన సైకిల్ ర్యాలీలో పాల్గొన్న సుంకరమెట్ట పంచాయతీ గుమ్మకోట గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్న పెట్టెలి అజయ్ అనే విద్యార్థికి సైకిల్, కిట్‌ను అందజేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ట్రైబల్ మ్యూజియం క్యూరేటర్ మురళి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment