చికిత్స పొందుతూరిమాండ్ ఖైదీ మృతి
మహారాణిపేట (విశాఖ)/కొయ్యూరు: హత్య కేసులో ఏ2 నిందితుడిగా ఉన్న భూ సరి రాజబాబు కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మరణించాడు. గతేడాది నవంబర్‌లో కొయ్యూరు మండలం, బకులూరు సమీపంలో జరిగిన హత్య కేసులో రాజబాబు రెండో నిందితుడిగా ఉన్నారు. రిమాండ్ ఖైదీగా విశాఖ సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. అతని ఆరోగ్యం విషమించడంతో కేజీహెచ్‌కు తరలించారు. ఇక్కడ చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మరణించాడు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని జైలు అధికారుల సమక్షంలో కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు కేజీహెచ్ ఆర్‌ఎంవో డాక్టర్ మెహర్‌కుమార్ తెలిపారు. విశాఖ వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment