హుకుంపేట: స్థానిక ప్రభుత్వ కళాశాలకు చెందిన ఓ బాలిక బిడ్డకు జన్మనిచ్చినట్లు గిరిజన సంఘం అనుబంధ ఐద్వా జిల్లా కార్యదర్శి సొంటేన హైమావతి ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మండలంలోని భూర్జా పంచాయతీ కొడయ్యపాడు గ్రామానికి చెందిన గిరిజన బాలిక ఇటీవల విశాఖ కేజీహెచ్‌లో ఓ బిడ్డకు జన్మనిచ్చిందని, ఆ బాలిక స్థానిక ప్రభుత్వ కళాశాలలో చదువుతూ, గిరిజన సంక్షేమ శాఖ హాస్టల్లో ఉండేదని తెలిపారు. ఈ ఘటనపై హాస్టల్ వార్డెన్ కన్యాకుమారిని వివరణ అడగగా నెల రోజులు మాత్రమే హాస్టల్లో ఉండి, ఫీజు కట్టలేక గ్రామానికి వెళ్లిపోయిందని, ఆ బాలికతో తమకు ఎటువంటి సంబంధం లేదని చెప్పినట్లు పేర్కొన్నారు. గత సంవత్సరంలో కూడా హాస్టల్‌లో ఇదే పరిస్థితి జరిగినప్పటికీ ఉన్నతాధికారులు పట్టించుకోలేదని, ఈ విషయంపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment