మయూరి హిల్ రిసార్ట్స్ హౌస్ కీపర్ హఠాన్మరణం
అరకులోయ టౌన్: ఏపీ టూరిజం అరకులోయ మయూరి హిల్ రిసార్ట్స్‌లో హౌస్ కీపర్‌గా పని చేస్తున్న పూజారి లలిత్(45) సోమవారం హఠాత్తుగా మృతి చెందారు. రిసార్ట్స్ ప్రాంగణంలో స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా పరిసరాలు శుభ్రం చేస్తూ కళ్లు తిరిగి కింద పడిపోయిన ఆయనను సహచర సిబ్బంది హుటాహుటిన అరకు ఏరియా ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. 2007 నుంచి పర్యాటక శాఖలో లలిత్ పని చేస్తున్నారు. మృతుడికి భార్య, ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. విషయం తెలుసుకున్న టూరిజం శాఖ డివిజినల్ బ్రాంచి మేనేజర్ జగదీష్ హుటాహుటిన అరకులోయకు చేరుకొని ఏరియా ఆస్పత్రికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మృతికి గల కారణాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మృతుడి కుటుంబానికి రూ. 2 లక్షలు ఇన్సూరెన్స్ ఇస్తామని టూరిజం డీబీఎం చెప్పడంతో అంగీకరించని కటుంబ సభ్యులు, గిరిజన సంఘాల నాయకులు, యూనియన్ ప్రతినిధులు ఆస్పత్రి నుంచి మృతదేహాన్ని మయూరి హిల్ రిసార్ట్స్‌కు తీసుకొచ్చి ఆందోళనకు దిగారు. దీంతో అరకులోయ తహసీల్దార్ ఎంవీవీ ప్రసాద్, డీబీఎం జగదీష్, గిరిజన సంఘం, టూరిజం కార్మికులతో చర్చలు జరిపారు. నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేసినప్పటికీ టూరిజం అధికారుల నుంచి సరైన స్పందన రాలేదు. రాత్రి 9 గంటల వరకు మృతదేహాంతో మయూరి హిల్ రిసార్ట్ వద్దే నిరసన తెలిపారు. తమకు న్యాయం జరిగితే తప్పా మృతదేహాన్ని తీసుకెళ్లే ప్రసక్తి లేదని కార్మికులు, గిరిజన సంఘాల నాయకులు స్పష్టం చేశారు. మృతుడి కుటుంబానికి రూ. 25 లక్షల పరిహారం ఇవ్వాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. ఆందోళనలో వైఎస్సార్‌సీపీ నాయకులు కమిడి అశోక్, పరశురాం, స్వాభి రామమూర్తి, గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు పొద్దు బాలదేవ్, తదితరులు పాల్గొన్నారు.
మృతదేహంతో కుటుంబీకులు, గిరిజన సంఘాలు ఆందోళన
రూ. 25 లక్షల పరిహారం చెల్లించాలని డిమాండ్
డీబీఎం, తహసీల్దార్‌తో కార్మికులు జరిపిన చర్చలు విఫలం
మయూరి హిల్ రిసార్ట్స్ హౌస్ కీపర్ హఠాన్మరణం
మయూరి హిల్ రిసార్ట్స్ హౌస్ కీపర్ హఠాన్మరణం
Comments
Please login to add a commentAdd a comment