చదువుతో పాటు ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి
రంపచోడవరం: ఏజెన్సీలోని ఆశ్రమ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల చదువుతో పాటు ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్‌కుమార్ అధికారులను ఆదేశించారు. మండలంలో బూసిగూడెం గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలను సోమవారం సాయంత్రం ఆయన ఆకస్మికంగా సందర్శించారు. ముందుగా విద్యార్థులతో మాట్లాడిి భోజనం ఎలా ఉందో అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు రక్తహీనతకు గురికాకుండా మంచి ఆహారం అందజేయాలన్నారు. సికిల్ సెల్ ఎనిమియా బాధితులు ఎంత మంది ఉన్నారు, రక్తహీనత లేకుండా ఎప్పకప్పుడు వైద్య పరీక్షలు చేయించి ఏ స్టేజిలో ఉందో తెలుసుకుని రిజిష్టర్‌లో నమోదు చేయాలన్నారు. మెనూ అమలుపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ప్రతి తరగతి గదిని సందర్శించి విద్యార్థులతో మాట్లాడి చదువు ఎలా చెబుతున్నదీ ఆరా తీశారు. విద్యార్థులను గ్రేడ్‌లుగా విభజించి చదువులో వెనుకబడిన వారికి ప్రత్యేక తరగతులు నిర్వహించాలన్నారు. ఈ ఏడాది పదో తరగతిలో నూరు శాతం ఫలితాలు సాధించాలన్నారు. పీవో కట్టా సింహాచలం, సబ్ కలెక్టర్ కల్పశ్రీ, డీడీ విజయశాంతి, ఏజెన్సీ డీఈవో మల్లేశ్వరరావు, ఈఈ ఐ.శ్రీనివాసరావు, తహసీల్దార్ రామకృష్ణ, ఎంపీడీవో సుండం శ్రీనివాసుదొర, తదితరులు పాల్గొన్నారు.
రక్తహీనతపై ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు
అధికారులకు కలెక్టర్ దినేష్‌కుమార్ ఆదేశం
బూసిగూడెం ఆశ్రమ పాఠశాల సందర్శన
Comments
Please login to add a commentAdd a comment