జీతాలు పెంచాలని అంగన్‌వాడీల ఆందోళన
చింతూరు: వేతనాలు పెంచాలని, మినీ సెంట ర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలని డిమాండ్ చేస్తూ సోమవారం స్థానిక ఐసీడీఎస్ కేంద్రం వద్ద అంగన్‌వాడీ వర్కర్లు ఆందోళన నిర్వహించారు. అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు నిర్వహించిన ఈ ఆందోళనలో సీఐటీయూ మండల ప్రధాన కార్యదర్శి పొడియం లక్ష్మణ్ మాట్లాడు తూ గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు అంగన్‌వాడీ వర్కర్లు ఎన్నో సేవలందిస్తున్నారని తెలిపారు. వారికి కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, ప్రమోషన్ల కోసం నిబంధనలను రూపొందించాలని, పెండింగ్‌లో ఉన్న 164 సూపర్‌వైజర్ల పోస్టులను వెంటనే భర్తీ చేయా లని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నూకరత్నం, వసంత, పార్వతి, సుక్కమ్మ, లలిత పాల్గొన్నారు.
రాజవొమ్మంగిలో
రాజవొమ్మంగి: తమ సమస్యలను తక్షణం పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మండలంలోని అంగన్‌వాడీ కార్యకర్తలు సోమవారం ఆందోళన చేశారు. సీఐటీయూ నేతల ఆధ్వర్యంలో స్థానిక ఐసీడీఎస్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి, ధర్నా నిర్వహించారు. కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలని, ఇతర సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు రామరాజు, అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా నాయకురాలు వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
అంగన్‌వాడీల హామీలను నెరవేర్చాలి
ముంచంగిపుట్టు: అంగన్‌వాడీలకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని సీఐటీయూ మండల కార్యదర్శి కె.శంకరరావు అన్నారు. ముంచంగిపుట్టులోని ఐసీడీఎస్ కార్యాలయం సూపర్‌వైజర్లకు సోమవారం సోమవారం సీఐటీయూ నేతలు, అంగన్‌వాడీలు సమస్యలతో కూడిన వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా శంకరరావు మాట్లాడుతూ అంగన్‌వాడీల వేతనాలు పెంచి, సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చి నెలలు గడుస్తున్నా నేటికీ అతీగతీ లేదన్నారు. తక్షణమే కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని, లేని పక్షన ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు.
జీతాలు పెంచాలని అంగన్‌వాడీల ఆందోళన
Comments
Please login to add a commentAdd a comment