‘ఉక్కు’ మహిళా ఉద్యోగులకు అవార్డులు
ఉక్కునగరం: విశాఖ స్టీల్‌ప్లాంట్ మహిళా ఉద్యోగు లు డాక్టర్ జి.సుజాత, రేష్మా సుల్తానాలకు జాతీయస్థాయి అవార్డులు లభించాయి. న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ఆది, సోమవారాల్లో జరిగిన 35వ జాతీయ ప్రభుత్వ రంగ మహిళా ఫోరం(విప్స్) సమావేశాల్లో స్టాండింగ్ కాన్ఫరెన్స్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ (స్కోప్) డైరెక్టర్ జనరల్, ఐఎల్‌వో పాలకమండలి సభ్యురాలు అతుల్ సోబ్జీ చేతులమీదుగా వీరు అవార్డులు స్వీకరించారు. ఉక్కు జనరల్ ఆస్పత్రిలో గైనకాలజీ చీఫ్ స్పెషలిస్ట్ డాక్టర్ జి.సుజాత చేసిన పరిశోధనలు, సేవలను గుర్తించి ఎగ్జిక్యూటివ్ కేటగిరీలో ఉత్తమ మహిళా ఉద్యోగి అవార్డుకు ఎంపిక చేశారు. స్టీల్‌ప్లాంట్‌కు చెందిన మాధారం మైన్స్‌లో ల్యాబ్ టెక్నీషియన్ రేష్మా సుల్తానా ఫార్మసీ కార్యకలాపాలు నిర్వహించడంలో చేసిన సేవలను గుర్తించి నాన్ ఎగ్జిక్యూటివ్ కేటగిరీలో ఉత్తమ ఉద్యోగిగా జాతీయ స్థాయి అవార్డు అందజేశారు. అలాగే స్టీల్‌ప్లాంట్ వుమెన్ ఇన్ పబ్లిక్ సెక్టార్ (విప్స్)కు ‘స్పెషల్ పార్టిసిపేషన్’అవార్డు లభించింది.
Comments
Please login to add a commentAdd a comment