మావోయిస్టుల బంద్‌తో పోలీసుల అలెర్ట్
చింతూరు: ఇటీవల ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌కు నిరసనగా మావోయిస్టులు మంగళవారం బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో సరిహద్దులో ఉన్న చింతూరు పోలీసులు అప్రమత్తమయ్యా రు. వాహనాల తనిఖీలు ముమ్మరం చేయడంతో పాటు విస్తృతంగా సోదాలు నిర్వ హిస్తున్నారు. బంద్‌నేపథ్యంలో చింతూరు మండలం ఏడుగురాళ్లపల్లి మీదుగా తెలంగాణకు రాత్రిపూట వెళ్లే వాహనాలను కూనవరం మండలం భీమవరం మీదుగా దారి మళ్లించారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన అల్లిగూడెంకు ప్రతిరోజూ మండలంలోని వెళ్లే పాసింజ ర్ షటిల్ బస్సు సర్వీసును రద్దుచేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని చర్యలు తీసుకున్నామని, సర్కిల్ పరిధి లోని రాజకీయ నాయకులకు నోటీసులు జారీచేసి, అప్రమత్తం చేసినట్టు సీఐ దుర్గాప్రసాద్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment