పాడేరు: సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఇన్ మారిటైం షిప్ బిల్డింగ్(సీఈఎంఎస్), విశాఖపట్నం పోర్టు అథారిటీ(వీపీఏ) సీఎస్‌ఆర్ నిధులతో నిరుద్యోగ యువతకు ఇన్వేంటరీ కంట్రోలర్, వెల్డింగ్ కోర్సుల్లో రెండు నెలల ఉచిత వసతితో కూడిన శిక్షణ ఇవ్వను న్నట్టు సీఈఎంఎస్ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కె.సేతు మాధవన్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. 27ఏళ్లలోపు వయస్సు గల టెన్త్, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ వెల్డర్, ఫిట్టర్ ఉత్తీర్ణులైన యువతీయువకులు అర్హులని తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈనెల 20వ తేదీ ఉదయం 9గంటలకు పాడేరు పోలీస్ స్టేషన్ గ్రౌండ్‌లో జరిగే శిబిరానికి విద్యార్హత, కుల ధ్రువీకరణ పత్రాలు, రేషన్, ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలతో హాజరు కావాలని పేర్కొన్నారు. మరిన్ని పూర్తి వివరాలకు 8688411100, 8331901237, 0891– 2704010 అనే ఫోన్ నంబర్లలో సంప్రదించాలని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment