ఉన్నత లక్ష్యంతో చదివితే ఉజ్వల భవిష్యత్
ముంచంగిపుట్టు: ఉన్నత లక్ష్యాన్ని నిర్దేశించుకుని చదివినప్పుడే ఉజ్వల భవిష్యత్ ఉంటుందని సీఆర్‌పీఎఫ్ 198 బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్ రంజిత్‌కుమార్ బల్‌గోత్ర అన్నారు. సీఆర్‌పీఎఫ్ కమాండెంట్ రాజేష్ పాండే ఆదేశాలతో స్థానిక సీఆర్‌పీఎఫ్ 198 బెటాలియన్ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల,బాలుర పాఠశాలలు 1,2లలో 126 మంది 10వ తరగతి విద్యార్థులకు సోమవారం పెన్నులు, స్వీట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రంజిత్‌కుమార్ బల్‌గోత్ర మాట్లాడుతూ విద్యార్థులు ప్రతి అంశాన్ని అర్థం చేసుకోవాలని సూచించారు. విద్యార్థులకు పదవ తరగతి ఎంతో కీలకమని, మంచి మార్కులు సాధించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ కృష్ణారావు,హెచ్‌ఎంలు లక్ష్మి, ప్రకాశం, మాణిక్యాలరావు, ఉపాధ్యాయులు శ్రీను,తిరుముల, భాగతరాం,ధనుంజయ తదితరులు పాల్గొన్నారు.
సీఆర్‌పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ రంజిత్‌కుమార్ బల్‌గోత్ర
Comments
Please login to add a commentAdd a comment