సీతంపేట(విశాఖ): విద్యుత్ సర్వీస్ కనెక్షన్ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టినా, డబ్బులు డిమాండ్ చేసినా, బిల్లింగ్ లోపాలు, విద్యుత్ మీటర్లలో సమస్యలున్నా విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక(సీజీఆర్‌ఎఫ్)కు ఫిర్యాదు చేయాల్సిందిగా సీజీఆర్‌ఎఫ్ చైర్‌పర్సన్, విశ్రాంత న్యాయమూర్తి డాక్టర్ బి.సత్యనారాయణ తెలిపారు. అక్కయ్యపాలెం 80 అడుగుల రోడ్‌లోని గౌరీ కల్యాణ మండపంలో విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మీటర్లు కాలిపోవడం, విద్యుత్ వోల్టేజి హెచ్చు తగ్గులు, విద్యుత్ మీటర్లలో లోపాలు, అదనపు లోడు మంజూరు, యజమాని పేరు మార్పు, కొత్త విద్యుత్ సర్వీసులు వంటి ఏ సమస్య అయినా ీసీతమ్మధార ఈపీడీసీఎల్ కార్యాలయంలోని సీజీఆర్‌ఎఫ్‌కు నేరుగా రాత పూర్వకంగా గాని, ఆన్‌లైన్, వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చన్నారు. సీజీఆర్‌ఎఫ్‌కు 2004 నుంచి ఇప్పటి వరకు 8442 ఫిర్యాదులు రాగా వాటిలో 8367 ఫిర్యాదులను పరిష్కరించినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment