● చింతపల్లి ఏపీడీ సీతయ్య
కొయ్యూరు: చింతపల్లి క్లస్టర్ పరిధిలో 2025–26 సంవత్సరానికి సంబంధించి కొయ్యూరు, గూ డెంకొత్తవీధి, చింతపల్లి మండలాల్లో నాలుగు వేల ఎకరాల్లో పండ్ల తోటలు పెంచాలని లక్ష్యంగా నిర్ణయించినట్టు ఉపాధి హామీ పథకం క్లస్టర్ ఏపీడీ లాలం సీతయ్య తెలిపారు. స్థానిక ఉపాధిహామీ కార్యాలయాన్ని ఆయన మంగళవారం సందర్శించారు. ఏపీవో అప్పలరాజుతో కలిసి విలేకరులతో మాట్లాడారు. 2024–25 సంవత్సరానికి సంబంధించి కొయ్యూరులో 780 ఎకరాల్లో నాటేందుకు రైతులకు పండ్ల మొక్కలు అందజేస్తున్నట్టు చెప్పారు. వీటిలో 250 ఎకరాల్లో నాటేందుకు సిల్వర్ ఓక్, 130 ఎకరాల్లో వేసేందుకు కొబ్బరి, 370 ఎకరాల్లో వేసేందుకు జీడిమామిడి మొక్కలు ఇస్తున్నట్టు చెప్పారు. గూడెంకొత్తవీధి మండలంలో 830 ఎకరాల్లో పలు రకాల పండ్ల మొక్కలు నాటనున్నట్టు చెప్పారు. వీటిలో అవకాడో 73 ఎకరాలు, జీడి 70 ఎకరాలు, స్వీట్ ఆరెంజ్ 150 ఎకరాలు, మిలిగిన ఎకరాల్లో సిల్వర్ ఓక్ నాటనున్నట్టు చెప్పారు.చింతపల్లిలో 1,932 ఎకరాలు కేటాయిస్తే 273 ఎకరాల్లో అవకాడో, 54 ఎకరాల్లో డ్రాగన్ ఫ్రూట్, 84 ఎకరాల్లో సపోట, 12 ఎకరాల్లో జాఫ్రా, మిగిలిన ఎకరాల్లో సిల్వర్ ఓక్ వేయనున్నట్టు చెప్పారు.కొయ్యూరు మండలంలో 1500 ఇంకుడు గుంతలు తవ్వాలన్నది లక్ష్యం కాగా, ఇప్పటి వరకు 885 మంజూరయ్యాయని, వాటిలో 300 గుంతల పనులు చేపట్టారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment