9 కిలోల కణితి తొలగింపు
అరకులోయటౌన్: స్థానిక ఏరియా ఆస్పత్రిలో సూపరింటెండెంట్, జనరల్ సర్జన్ డాక్టర్ లగుడు రాము నేతృత్వంలో ఆపరేషన్ చేసి ఓ మహిళ అండాశయం నుంచి తొమ్మిది కిలోల కణితిని తొలగించారు. ఈ సందర్భంగా డాక్టర్ రాము మాట్లాడుతూ డుంబ్రిగుడ మండలం బల్లగెడ్డ గ్రామానికి చెందిన పాంగి చిలకమ్మ మూడు సంవత్సరాలుగా పొత్తి కడుపు నొప్పి,వాపుతో బాధపడుతోందన్నారు. ఆమెకు మంగళవారం అరకు ఏరియా ఆస్పత్రిలో శస్త్ర చికిత్స నిర్వహించి 9 కిలోల అండాశయ కణితి తొలగించినట్టు చెప్పారు. గత ఆరు నెలల్లో అరకు ఏరియా ఆస్పత్రిలో ఇది రెండో అతి పెద్ద శస్త్ర చికిత్స అని చెప్పారు. ఈ ఆపరేషన్‌లో మత్తు వైద్యుడు డాక్టర్ అప్పారావు, స్టాఫ్ నర్సు మంగ, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment