మిరియం
మురిసేలా
1.10లక్షల
ఎకరాల్లో మిరియాల
పాదులు
సాక్షి,పాడేరు: జిల్లాలో కాఫీ తోటల్లో అంతరపంటగా గిరిజన రైతులు సాగుచేస్తున్న మిరియాల పంట విరగ్గాసింది. పాదులకు అఽధికంగా మిరియాల కాపు ఉండడంతో గిరిజన రైతులు మురిసిపోతున్నారు.నాణ్యతలో నంబర్–1గా జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న మన్యం మిరియాలు ఈఏడాది కూడా గిరిజన రైతులకు అధిక లాభాలు అందించనున్నాయి. కేరళ,కర్నాటక,తమిళనాడు,ఒడిశా రాష్ట్రాలలో మిరియాల పంట ఉన్నప్పటికీ అల్లూరి జిల్లాలో గిరిజనులు సేంద్రియ పద్ధతిలో సాగుచేస్తున్న మిరియాలే నాణ్యతలో నంబర్ వన్‌గా నిలుస్తున్నాయి. ఘాటు అధికంగా ఉండే మన్యం మిరియాలకు జాతీయ మార్కెట్‌లో మంచి ఆదరణ ఉంది. గత ఏడాది కిలో రూ.600 నుంచి రూ.700ధరతో వ్యాపారులు కొనుగోలు చేశారు.
1.10 లక్షల ఎకరాల్లో సాగు
జిల్లాలో 1.48 లక్షల ఎకరాల్లో ఫలసాయం ఇచ్చే కాఫీతోటలను గిరిజనులు సాగు చేస్తున్నారు. వాటిలో 1.10 లక్షల ఎకరాల్లో మిరియాల పాదులను అంతరపంటగా వేశారు.ఎకరానికి తక్కువలో చూసుకున్న 100 కిలోల ఎండు మిరియాలను రైతులు మార్కెటింగ్ చేస్తారు. ఎకరానికి రూ.60వేల నుంచి రూ.70వేల వరకు ఆదాయం లభిస్తుంది.గత ఏడాది 11వేల టన్నుల వరకు దిగుబడి వచ్చింది.ప్రైవేట్ వ్యాపారులు పోటాపోటీగా కొనుగోలు చేశారు. ఈ ఏడాది కూడా వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండడంతో మిరియాల పాదులకు కాపు విరగ్గాసింది. దిగుబడులు మరింత పెరిగి కనీసం 12వేల టన్నుల వరకు మార్కెట్ జరుగుతుందని ఉద్యానవన,కాఫీబోర్డు,స్పైసెస్ బోర్డు అధికారులు అంచాన వేస్తున్నారు.
మిరియాల సేకరణ ప్రారంభం : మిరియాల పాదులకు ఉన్న గింజల సేకరణను గిరిజన రైతులు ప్రారంభించారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో స్పైసెస్ బోర్డు,పాడేరు ఐటీడీఏలు అల్యూమినియం నిచ్చెనలను పంపిణీ చేయడంతో గిరిజన రైతులకు ఎంతో మేలు జరిగింది. వాటితోనే మిరియాలను సేకరిస్తున్న గిరిజన రైతులు వెనువెంటనే వేడినీళ్లలో నానబెట్టి ఎండు
మిరియాలను తయారు చేస్తున్నారు. గింజల్లో తేమ పూర్తిగా పోయిన తరువాత రైతులు సంతల్లో అమ్మకాలు చేపడుతున్నారు.
కిలో రూ.550 ధరతో కొనుగోళ్లు ప్రారంభం
జిల్లాలో మిరియాల వ్యాపారం ప్రారంభమైంది.ప్రారంభ దశ కావడంతో వ్యాపారులు కిలో రూ.550ధరతో కొనుగోలు చేస్తున్నారు.ఈ ఏడాది కూడా మన్యం మిరియాలకు డిమాండ్ అధికంగా ఉందని పెద్ద వ్యాపారులు చెబుతున్న నేపథ్యంలో వచ్చే వారం నుంచి ధరలు పెంచి వ్యాపారులు పోటాపోటీగా కొనుగోలు చేసే అవకాశం ఉంది. అయితే కాఫీ పంట వలే మిరియాలను కూడా జీసీసీ,పాడేరు ఐటీడీఏలు కొనుగోలు చేయాలని గిరిజన రైతులు డిమాండ్ చేస్తున్నారు.
ఎండు మిరియాలు
గత ఏడాది
11వేల టన్నుల
వ్యాపారం
ఎకరానికి
రూ.60వేల
ఆదాయం
గత ఏడాది మోసపోయాను
గత ఏడాది సీజన్ ప్రారంభంలో వ్యాపారులకు తక్కువ ధరతో మిరియాలను అమ్ము కుని మోసపోయాను. కిలో రూ.550ధరతో కొన్న వ్యాపారులు తూకంలోనూ మోసం చేశారు.ఐటీడీఏ అధికారులు సంతల్లో తూకం కేంద్రాలను ఏర్పాటు చేసి, మిరియాలకు గిట్టు బాటు ధర కల్పించాలి – దూసురి కర్రన్న,
మిరియాల రైతు, హుకుంపేట
గిట్టుబాటు ధర కల్పిస్తాం
నాణ్యతలో నంబర్–1గా నిలుస్తున్న జిల్లాలో సాగవుతున్న మిరియాలకు గిట్టుబాటు ధర కల్పిస్తాం.మిరియాల మార్కెటింగ్‌కు సంబంధించి అధికారులతో కమిటీ వేస్తాం. జాతీయ స్థాయిలో మిరియాల వ్యాపారులతోను ఈ కమిటీ చర్చలు జరిపి అధిక ధరలతో కొనుగోలు చేసేలా ఏర్పాట్లు చేస్తాం.ఈఏడాది మిరియాల కాపు ఆశాజనకంగా ఉంది. – ఎ.ఎస్.దినేష్‌కుమార్, కలెక్టర్
ప్రభుత్వమే కొనుగోలు చేయాలి
కాఫీ గింజల మాదిరిగానే మిరియాలకు ప్రభుత్వం గిట్టుబాటు ధరలు ప్రకటించి జీసీసీ,ఐటీడీఏలతో కొనుగోలు చేయించాలి. జాతీయ మార్కెట్‌లో కిలో రూ.1,000 ధరతో గత ఏడాది మిరియాల అమ్మకాలు జరిగాయి. మిరియాల గింజలకు మార్కెటింగ్,గిట్టుబాటు ధర కల్పించే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి.
– పాలికి లక్కు, కాఫీ రైతుల సంఘం జాతీయ నాయకుడు, గుర్రగరువు, పాడేరు మండలం
మిరియం
మిరియం
మిరియం
మిరియం
మిరియం
Comments
Please login to add a commentAdd a comment