పెండింగ్ పనులు సత్వరం పూర్తి
కలెక్టర్ దినేష్‌కుమార్ ఆదేశం
రంపచోడవరం/దేవీపట్నం: పోలవరం ప్రాజెక్టు పునరావాస కాలనీల్లో పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఎ.ఎస్ దినేష్‌కుమార్ ఆదేశించారు. దేవీపట్నం మండలంలోని పునరావాస కాలనీలను మంగళవారం ఆయన సందర్శించారు. పెండింగ్‌లో ఉన్న ఆర్‌అండ్‌ఆర్ పనులు వెంటనే పూర్తి చేయాలన్నారు. పూర్తిస్థాయిలో ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ మంజూరు చేయాలని కొంతమంది నిర్వాసితులు కలెక్టర్‌ను కోరారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ నిబంధనల ప్రకారం దర్యాప్తు చేసి అర్హతలను బట్టి ప్యాకేజీ అమలుకు చర్యలు తీసుకొంటామని తెలిపారు. పినికిలపాడు, కొండమొదలు, తాళ్లూరు, మెట్టగూడెం తదితర కాలనీలను పరిశీలించారు. కొండమొదలు కాలనీలో నిచ్చెన సాయంతో మేడపైకి ఎక్కి కాలనీ అంతా పరిశీలించారు. కలెక్టర్ వెంట ఐటీడీఏ పీవో కట్టా సింహాచలం, సబ్‌కలెక్టర్ కల్పశ్రీ,తహసీల్దార్ కరక సత్యనారాయణ, ఎంపీడీవో రత్నకుమారి, డీటీ త్రిమూర్తులు, ఈఈ శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు.
గిరిజన రైతుల ఆర్థికాభివృద్ధికి కృషి చేయాలి
రంపచోడవరం: గిరిజన రైతులు ఆర్థికంగా బలోపేతమయ్యేలా కృషి విజ్ఞాన కేంద్రం, ఉద్యానవన పరిశోధన స్థానాల శాస్త్రవేత్తలు కృషి చేయాలని కలెక్టర్ ఎ.ఎస్.దినేష్‌కుమార్ తెలిపారు. మెరుగైన సాంకేతిక పరిజ్ఞానం అందించి తద్వారా, అధిక దిగుబడులు సాధించేలా ప్రోత్సహించాలని సూచించారు. పందిరిమామిడి కేవీకేను మంగళవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గిరిజన రైతుల నుంచి సేకరించిన తాటి, జీలుగు నీరా మంచి ఆరోగ్యకమైనదన్నారు. కేవీకే ప్రాంగణంలో ఏర్పాటు చేసిన చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాన్ని పరిశీలించి, మత్స్యశాస్త్రవేత్త వీరాంజనేయులతో మాట్లాడారు. ఏడాదికి ఎన్ని వేల నారు చేప పిల్లలను ఉత్పత్తి చేస్తున్నారో తెలుసుకున్నారు. రైతులకు పంపిణీ చేసే కోడి పిల్లలను, మేకలను కలెక్టర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పీవో కట్టా సింహాచలం, సబ్‌కలెక్టర్ కల్పశ్రీ, కేవీకే కోఆర్డినేటర్ డాక్టర్ రాజేంద్రప్రసాద్, హెచ్‌ఆర్‌ఎస్ హెడ్ పీసీ వెంగయ్య, శాస్త్రవేత్తలు క్రాంతికుమార్, ప్రవీణ్‌బాబు తదితరులు పాల్గొన్నారు.
పెండింగ్ పనులు సత్వరం పూర్తి
పెండింగ్ పనులు సత్వరం పూర్తి
Comments
Please login to add a commentAdd a comment