ఇలా అయితే.. టెన్త్ ఎలా పాసవుతారు ?
జి.మాడుగుల: కనీస స్థాయిలో కూడా విద్యార్థులు సమాధానాలు చెప్పడం లేదని, ఇలా అయితే పదో తరగతి పరీక్షలు ఎలా పాసవుతారని పాడేరు ఐటీడీఏ పీవో, జాయింట్ కలెక్టర్ ఎం.జె.అభిషేక్ గౌడ ఉపాధ్యాయులను ప్రశ్నించారు. ఆయన మంగళవారం మండలంలోని బందవీధి, జి.మాడుగులలో గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. బందవీధి బాలికల ఆశ్రమపాఠశాలలో 8,10వ తరగతుల విద్యార్థులకు పలు ప్రశ్నలు వేయగా ఎవరూ సరైన సమాధానం చెప్పకపోవడంతో ఉపాధ్యాయులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా ఉంటే 10వ తరగతి పరీక్షలు ఎలా పాస్ అవుతారని ప్రశ్నించారు. మెరుగైన బోధన చేయాలని, విద్యా ప్రమాణాల మెరుగుపడకపోతే సస్పెండ్ చేసానని ఆయన ఉపాధ్యాయులను హెచ్చరించారు. విద్యార్థులకు పల్లీ చెక్కీ, రాగీమాల్ట్ అందజేయక పోవడంతో వార్డెన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు నాణ్యమైన మెనూ అమలు చేయడంలో అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వంటగదిని పరిశీలించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆదేశించారు. అనంతరం జి.మాడుగుల ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాల–1ను తనిఖీ చేశారు. విద్యార్థుల విద్యాప్రమాణాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. మెనూపై విద్యార్థులను ఆరా తీశారు. చికెన్‌కు బదులు స్వీటు, వెజిటేరియన్ కర్రీ విద్యార్థులకు అదనంగా అందజేయాలని ఆదేశించారు. స్టడీ అవర్‌లో ఉండవలసిన ఉపాధ్యాయులు అందుబాటులో లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. డీడీ ఎల్.రజని తదితరులు పాల్గొన్నారు.
పాడేరు ఐటీడీఏ పీవో, జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ్ ఆగ్రహం
బందవీధి, జి.మాడుగుల గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల తనిఖీ
ప్రశ్నలకు విద్యార్థులు సమాధానం చెప్పలేకపోవడంతో అసంతృప్తి
ఇలా అయితే.. టెన్త్ ఎలా పాసవుతారు ?
Comments
Please login to add a commentAdd a comment