సరియాపల్లిలో 20 మందికి అస్వస్థత
ముంచంగిపుట్టు: మండలంలోని బంగారుమెట్ట పంచాయతీ సరియాపల్లిలో 20 మంది అస్వస్థతకు గురయ్యారు. చిన్నా,పెద్ద అనే తేడా లేకుండా చాలా మంది వాంతులు,విరోచనాలతో బాధపడుతున్నా రు. వాంతులు, విరోచనాలతో ఒకే రోజు ఇద్దరు మృతి చెందడంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు.మంగళవారం ఉదయం గ్రామానికి చెంది న గోల్లోరి దనియా(56), సాయంత్రం ఏడాది బాలు డు కిలో వినయ్ వాంతులు,విరోచనాలతో మృతి చెందారు. ప్రసుత్తం గ్రామంలో కొర్రా విక్రత్,కొర్రా హర్షిత్,వంతాల సిద్ధాంత్,కొర్రా వసంత అనే ఏడాదిలోపు చిన్నారులతో పాటు మరికొంత మంది వాంతలు,విరోచనాలతో బాధపడుతున్నారు. చిన్నారు లకు శరీరంపై పుండ్లు ఏర్పడ్డాయి. చాలా మంది 10 రోజులుగా అస్వస్థతతో మంచం పట్టారు. ఇటీవల కిలగాడ వైద్యసిబ్బంది గ్రామంలో వైద్య శిబిరం నిర్వహించి, వైద్యసేవలు అందించినా అదుపులోకి రాకపోవడంతో గ్రామస్తులకు కంటిమీదకునుకు కరువైంది. తక్షణమే వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు స్పందించి ప్రత్యేక మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయాలని బంగారుమెట్ట సర్పంచ్ రత్న,వైఎస్సార్ సీపీ మండల నేత మోహన్,సరియాపల్లి గ్రామస్తులు కోరారు.దీనిపై కిలగాడ వైద్యాధికారి రమేష్ వద్ద ప్రస్తవించగా సరియాపల్లిలో గత వారం వైద్య శిబి రం నిర్వహించామని, బుధవారం మరోసారి శిబి రం నిర్వహిస్తామని తెలిపారు. అవసరమైతే పీహెచ్ సీకి తీసుకువచ్చి వైద్య సేవలు అందిస్తామన్నారు.
వాంతులు, విరోచనాలతో
ఒకే రోజు చిన్నారితో సహా ఇద్దరి మృతి
భయాందోళనలో గ్రామస్తులు
ప్రత్యేక మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి
సరియాపల్లిలో 20 మందికి అస్వస్థత
సరియాపల్లిలో 20 మందికి అస్వస్థత
Comments
Please login to add a commentAdd a comment