పారదర్శకంగాఎమ్మెల్సీ ఎన్నికలు
డీఆర్‌వో పద్మలత
సాక్షి,పాడేరు: ఎన్నికల సంఘం నిబంధనలను పక్కాగా అమలు చేసి, పారదర్శకంగా ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలను నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి కె.పద్మలత ఆదేశించారు. కలెక్టరేట్‌లో పోలింగ్ నిర్వహణపై పీవోలు,ఏపీవోలకు మంగళవారం ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సిబ్బంది సమన్వయంతో పనిచేసి, ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా కృషి చేయాలన్నారు. బ్యాలెట్ పత్రాల వినియోగం, బ్యాలెట్ బాక్సుల నిర్వహణ,సీళ్లు వేయడం తదితర ఎన్నికల విధుల్లో అప్రమత్తంగా ఉండాలన్నారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రం నుంచి సేకరించిన పోలింగ్ సామగ్రి సక్రమంగా ఉన్నదీ లేనిదీ ముందుగానే పరిశీలించాలని సూచించారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన సమయానికి పోలింగ్ ప్రక్రియ ప్రారంభించాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో ఎస్‌డీసీ లోకేష్,మాస్టర్ ట్రైనర్లు చెల్లయ్య, సూపరింటెండెంట్ తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు.
వారం రోజుల్లో మోస్తరు వర్షాలు
చింతపల్లి: రాగల వారంరోజుల్లో జిల్లాలోని పలు మండలాల్లో చిరుజల్లులతోపాటు ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనాస్థానం వాతావరణ విభాగం నోడల్ అధికారి డాక్టర్ ఆళ్ల అప్పలస్వామి మంగళవారం తెలిపారు. వాతావరణంలో ఏర్పడిన మార్పుల కారణంగా కొన్ని చోట్ల చిరుజల్లులు కురుస్తాయని, తేమతోకూడిన వాతావరణం ఉంటుందని చెప్పారు. మరికొన్ని చోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment