మెరుగైన సేవలందించడమే లక్ష్యం
పాడేరు రూరల్: మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా అంగన్‌వాడీ కార్యకర్తలకు ఆరు రోజుల పాటు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్టు ఐసీడీఏ పీడీ సూర్యలక్ష్మి తెలిపారు. మండల కేంద్రం పాడేరులోని శ్రీకృష్ణాపురం ఆశ్రమ పాఠశాలలో మంగళవారం ఆమె శిక్షణ తరగతులు ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ అంగన్‌వాడీ కార్యకర్తలు పూర్తిస్థాయిలో అవగాహన కలిగిఉండాలని చెప్పారు. చిన్నారులకు మెరుగైన సేవలందించేందుకు శిక్షణ దోహదపడుతుందని తెలిపారు. పౌష్టికాహారాన్ని చిన్నారులు, గర్భిణులు, కిషోరబాలికలు,బాలింతలకు సకాలంలో అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో–1 విశ్వప్రసాధ్, ఐసీడీఎస్ సీడీపీవో ఝాన్సీరాణి పాల్గొన్నారు.
ఐసీడీఎస్ పీడీ సూర్యలక్ష్మి
మెరుగైన సేవలందించడమే లక్ష్యం
Comments
Please login to add a commentAdd a comment