చింతూరు: వై.రామవరం మండలం డొంకరాయిలోని ఓ బెల్టుషాపునకు అక్రమంగా తరలించేందుకు లోడ్ చేస్తున్న 24 కేసుల మద్యాన్ని చింతూరు ఎకై ్సజ్ పోలీసులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. రాజమండ్రి నుంచి చింతూరులోని మద్యం దుకాణాలకు సరఫరా చేసేందుకు ఓ వ్యానులో మద్యం కేసులు వచ్చాయి. ఈ క్రమంలో ఓ దుకాణం వద్ద వ్యానులో నుంచి ఆటోలోకి మద్యం కేసులను లోడు చేస్తున్న సమాచారం అందుకున్న ఎకై ్సజ్ పోలీసులు అక్కడికి చేరుకుని మద్యం లోడుతో ఉన్న ఆటోను స్వాధీనం చేసుకున్నారు. వై.రామవరం మండలం చవిటిదిబ్బలులోని మద్యం దుకాణానికి వెళ్లాల్సిన మద్యం కేసులను డొంకరాయిలోని బెల్టుషాపునకు తరలించేందుకు చింతూరులో ఆటోలో లోడు చేస్తుండగా దాడిచేసి స్వాధీనం చేసుకున్నట్టు చింతూరు ఎకై ్సజ్ ఎస్‌ఐ స్వామి తెలిపారు. ఆటోలో లోడుచేసిన రూ.1.12 లక్షల విలువైన 13 బీరు కేసులు, 11 లిక్కరు కేసులను స్వాధీనం చేసుకుని ఆటోడ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment