● యువకుడి మృతి
అచ్యుతాపురం రూరల్: మండలంలోని మడుతూరు కూడలికి కూతవేటు దూరంలో గాజువాక వెళ్లే రహదారిలో రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో వాకపల్లి రమేష్ (19) యువకుడు మృతి చెందినట్లు పోలీసులు మంగళవారం తెలిపారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం సాయంత్రం మృతుడు రమేష్ గాజువాక రహదారిలో వెళ్తుండగా ఆర్టీసీ బస్సును ఓవర్ టేక్ చేస్తుండగా మరో ద్విచక్ర వాహనం ఎదురుగా వచ్చి ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అచ్యుతాపురం వైపు వస్తున్న మరో ద్విచక్ర వాహనదారు కాలు విరిగింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment