గజానికో గుంత..!
పాడేరు నుంచి మైదాన ప్రాంతాలకు వెళ్లే ప్రధాన వడ్డాది రోడ్డులో పలు చోట్ల గుంతలు వాహనచోదకులను భయపెడుతున్నాయి. పాడేరు మెయిన్‌రోడ్డు నుంచి నక్కలపుట్టు సమీపం వరకు రూ.కోటితో రోడ్డు వేసిన ఆర్‌అండ్‌బీ అధికారులు, అక్కడ నుంచి వంతాడపల్లి అటవీశాఖ చెక్‌పోస్టు వరకు కిలోమీటరు అధ్వాన రోడ్డును మాత్రం మరిచిపోయారు. ఈ రోడ్డులో గోతులు అధికంగా ఉండడంతో వాహనాలు నడిపేందుకు వాహన చోదకులు ఇబ్బందులు పడుతున్నారు. ఇదే రోడ్డులోని కోట్లగరువు కాలనీ, కోట్లగరువు వంతెన సమీపంలోను గోతులను పూర్తి స్థాయిలో పూడ్చలేదు. ఒక గొయ్యిని పూడ్చి పక్కనే మరిన్ని గోతులను అలాగే వదిలేశారు. పాడేరు ఘాట్‌లోని మోదకొండమ్మతల్లి పాదాలు దాటిన తరువాత ఓనురు జంక్షన్ కాఫీతోటల వద్ద రోడ్డు మధ్యలో పెద్ద గొయ్యి ప్రమాదకరంగా మారింది. కొత్తగా ఘాట్‌లో ప్రయాణించే బైక్ చోదకులు ఈగొయ్యి ప్రాంతంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మైదాన ప్రాంతాలకు పోయే ప్రధాన ఆర్‌అండ్‌బీ రోడ్డు కావడంతో వాహనాల రద్దీ అధికంగా ఉంటుంది. ఈ పరిస్థితుల్లో పూర్తిస్థాయిలో రోడ్డు అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని వాహన చోదకులు, ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.
గుంతలు లేని రహదారులే లక్ష్యం..సంక్రాంతి నాటిని రోడ్లన్నీ మెరుగుపరుస్తామని కూటమి ప్రభుత్వ ఊదరగొట్టింది. సంక్రాంతి వెళ్లి శివరాత్రి కూడా వచ్చేస్తోంది. కానీ కూటమి నేతల హామీ మాత్రం నెరవేరలేదు. మన్యంలో రహదారులు అత్యంత దారుణంగా ఉన్నాయి. గుంతల పూడ్చివేత పనులు నామమాత్రంగా చేసి చేతులు దులుపుకున్నారు. – సాక్షి, పాడేరు
సంక్రాంతి నాటికి గుంతలు లేని
రహదారులే లక్ష్యమన్న కూటమి ప్రభుత్వం
శివరాత్రి వచ్చేస్తున్నా ఆ ఊసేలేని వైనం
పలు చోట్ల భయపెడుతున్న గోతులు
నక్కలపుట్టు నుంచి కోట్లగరువు వరకు గోతులే గోతులు
పెండింగ్ పనులకుప్రతిపాదనలు
పాడేరు–వడ్డాది రోడ్డులో పెండింగ్ పనులకు ప్రభుత్వానికి రూ.2 కోట్లతో ప్రతిపాదనలు పంపాం. నిధులు మంజూరు కాగానే నక్కలపుట్టు నుంచి వంతాడపల్లి చెక్‌పోస్టు వరకు రోడ్డు అభివృద్ధి చేస్తాం. పలుచోట్ల గుంతలను పూడ్చివేస్తాం
– బాలసుందరబాబు, ఎగ్జిక్యూటివ్
ఇంజినీర్, ఆర్‌అండ్‌బీ శాఖ, పాడేరు
Comments
Please login to add a commentAdd a comment